Others

ఔను... పొడవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీర శతావధానిగా పేరుగాంచిన గాడేపల్లి వీరరాఘవ శాస్ర్తి (1891-1945)గారు విధి వశాత్తు ప్రథమ కళత్రం గతించగా, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నించే సందర్భంలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రాంతానికి వెళ్లారు. శాస్ర్తిగారు ఆజానుబాహువు. గంభీరమైన విగ్రహం. వధువు పేరు సావిత్రమ్మ. పిడతల లక్ష్మీనృసింహశాస్ర్తిగారి కుమార్తె. వధువు ఇంటిలోనే పెండ్లిచూపులు. మాటలు జరిగే సందర్భంలో ‘చాలా పొడవుగా ఉన్నాడే!’ అని శాస్ర్తిగారిని గూర్చి వధువో లేక వధువు వైపు వారో అనుకోవడం శాస్ర్తిగారి చెవినపడింది. వెంటనే వారు -
కం: పొడవనిన నిజమె, విద్యకు
పొడవే, కీర్తికిని పొడవె, బుద్దికి పొడవే
పొడవే విత్తమునకు, నిక
తొడవులకును పొడవె, మానుదువొ, పూనుదువో!
- అని చెప్పి వచ్చేశారట.
పొడవైన వీరి కవితామూర్తి సావిత్రమ్మగారికి నచ్చినట్టుంది. వారే శాస్ర్తిగారి అర్ధాంగియై వీరి కవితా వ్యవసాయానికి సాయం చేశారు. పూర్వం కవులు ఎంత కవితాత్మకంగా జీవించేవారో ఈ ఐతిహ్యం తెలియజేస్తుంది.

-- డీవీఎం సత్యనారాయణ, 9885846949