Others

అతడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి అల ఒడ్డున పాకుతున్న ప్రతిబింబంలోకి
దగ్ధమయ్యే దేహపు ఎడారిలో
కొంత చీకటిని
ఒక చిగురును వదలి వెళ్లినట్లు
అతడొక స్వప్నగీతాన్ని రాసి
ఈ ప్రపంచానికి బహుమతిగానిచ్చాడు
వేల సిరాచుక్కల మెదడు కదలికల్లో
చైతన్యమంతా రంగరించి...
మసిపూసిన మారేడుకాయలాంటి
డొల్ల బతుకులోకి
అమృతబాండమేదో కవ్వమేసి చిలికినట్లు
కొన్ని అలికిడులను
కొంత మార్మిక వేదనను
గాయపడిన ప్రతి ఎదపై చిలకరిస్తూ
అస్తమించని సూరీడై వెలిగిపోయాడు.. అతడు!
మట్టిపాదాల రేణువులపై పచ్చని పువ్వొకటి
పుప్పొడి రాల్చినట్లు
అతడు... మనిషి నుండి మనిషిలోకి
సాంద్రతర ప్రయాణమై నిరంతరంగా ప్రవహిస్తాడు
సలపరించే గుండె కోతల్లోను...
గుక్కపట్టి ఏడ్చే ఎక్కిళ్ల బతుకు దుఃఖంలోను..
క్షతగాత్రపు ఒంటరి రాత్రుల నిట్టూర్పుల్లోను...
అతడొక సామూహిక స్వరమై ప్రతిధ్వనిస్తాడు
అపశృతులతో వెంటాడే జీవితకాలపు
దివారాత్రాల నడుమ... వెలిగిపోయే వేగుచుక్కలా
నీలోని కవి ఎవడో నిరంతరంగా
నిన్ను వెలిగిస్తూనే ఉంటాడు!!

- బి. కళాగోపాల్, 9441631029