Others

ఇంద్రగంటి శ్రీకాంతశర్మకు శిఖామణి సాహితీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ, యానాం సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి ప్రతి ఏటా ఇచ్చే శిఖామణి సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకులు, సీనియర్ పాత్రికేయులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఎంపికయ్యారు. అక్టోబరు 28న సా. 5 గంటలకు యానాంలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో శ్రీకాంతశర్మకు పదివేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఈ సందర్భంగా శిఖామణి సాహిత్య సర్వస్వం - సంపుటం -4, ‘శిఖామణి పీఠికలు’ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి.విజయభాస్కర్, కె.శివారెడ్డి, సుధామ, చందు సుబ్బారావు, డా. సీతారాం, డా. రాధేయ, ఖాదర్ మొహియుద్దీన్, మువ్వా శ్రీనివాసరావు, డా. కోయ కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. వివిధ రంగాలలో కృషి చేసిన మరో పదిమందికి కవిసంధ్య ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కవిసంధ్య కార్యదర్శి దాట్ల దేవదానంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ పురస్కారాన్ని కె.శివారెడ్డి, గోరటి వెంకన్నలు అందుకున్నారు.

కవితా సంపుటాలకు ఆహ్వానం
సత్య-మూర్తి చారిటబుల్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు కవి, రచయత, కార్టూనిస్ట్, సంస్థ అధ్యక్షుడు మోదు రాజేశ్వరరావు తెలిపారు. 2015-18 మధ్యకాలంలో ప్రచురించిన కవితా సంపుటాలను ఒక్కొక్కటి నాలుగు కాపీల చొప్పున పంపించాలని కోరారు. నవంబర్ 19న విశాఖలో జరిగే వార్షికోత్సవ వేడుకలో విజేతలకు నగదు, శాలువ, జ్ఞాపిక, పలు పుస్తకాలను పురస్కారం సందర్భంగా అవార్డు గ్రహీతలకు అందజేస్తుందని తెలిపారు. వార్షికోత్సవ వేడుక సందర్భంగా పలువురు రచయతలు, కవుల పుస్తకాలు ఆవిష్కరింపబడతాయ. ఈ ఏడాది నలుగురు కవులను, నలుగురు కష్టజీవులను తమ ట్రస్టు పురస్కారాలతో సత్కరిస్తుందన్నారు. కవితా సంపుటాలను అక్టోబర్ 31వ తేదీలోగా మోదు రాజేశ్వరరావు, సత్య-మూర్తి చారిటబుల్ ట్రస్ట్, జుత్తాడ కాలనీ, పెందుర్తి, విశాఖపట్నం - 531 173 అనే చిరునామాకు పంపించాలని ట్రస్ ట నిర్వహకులు ఒక ప్రకటనలో కోరారు. ఇతర వివరాలకు మొబైల్ నెం. 8333807116లో సంప్రదించవచ్చు.