సాహితి

24న ‘వేదన’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ సాహిత్య రంగంలో ప్రసిద్ధిగాంచిన సుప్రసిద్ధ కవి జయశంకర్ ప్రసాద్ రాసిన ‘ఆంసూ’ గేయ కవిత్వాన్ని ‘వేదన’గా జలజం సత్యనారాయణ అనుసృజించారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ‘వేదన’ ఆవిష్కరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపి విచ్చేసి ఆవిష్కరిస్తారు. సభాధ్యక్షులుగా తె.ర.వే. పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, విశిష్ట అతిథిగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాసగౌడ్, ఆత్మీయ అతిథిగా సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు బి.నర్సింగరావు పాల్గొంటారని తెలంగాణ రచయితల వేదిక, మహబూబ్‌నగర్ ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు భాషా సాహిత్య
పరిశోధనా గ్రంథాలకు ఆహ్వానం

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారాన్ని ఈ ఏడాది భాషా సాహిత్య పరిశోధనా గ్రంథానికి ప్రదానం చేయనున్నట్లు డా. కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన మూడు సంవత్సరాల్లో ముద్రితమైన తెలుగు భాషా సాహిత్య పరిశోధన గ్రంథాన్ని పురస్కారానికి పరిశీలింపబడుతుందనీ, మూడేసి ప్రతులను పంపించాలని పేర్కొన్నారు. పురస్కారంగా పదివేల నగదు, మెమొంటో ప్రదానం చేయనున్నారు.

విమర్శనా గ్రంథాలకు...

శ్రీమతి కొలకలూరి భాగీరథీ పురస్కారాన్ని ఈ ఏడాది సాహిత్య విమర్శనం గ్రంథానికి ప్రదానం చేయనున్నారు. గడచిన మూడు మూడు సంవత్సరాల్లో ముద్రితమైన సాహిత్య విమర్శ గ్రంథాలను ఈ పురస్కారానికి పరిశీలింపబడుతుంది. పురస్కారంగా పదివేల నగదు, మెమొంటో ప్రదానం చేస్తారు. గ్రంథాలను డా. కొలకలూరి సుమకిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆంగ్ల శాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502 చిరునామాకు పంపించాలి.