సాహితి

వ్యాపించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు నువ్వులా కాకుండా
గాల్లోంచి ఎగిరొచ్చిన పరిమళంలా
మీట నొక్కగానే వెలుగు పరుచుకునే
విద్యుత్ దీపంలా
వ్యాపించు... వ్యాపించు...
ఆవృతాల్ని పెనవేసుకుంటూ.
లోలోపలి సమస్త కల్మషాల్ని కడిగేసుకుని
కొత్త చూపుల్ని ఆవిష్కరించుకున్న
స్వచ్ఛ మానవుడిలా
మరో లోకాన్ని సృష్టించుకున్నట్లుగా
వ్యాపించు... వ్యాపించు
నిలువెల్లా నూతన చర్మం తొడుక్కుంటూ.
కనిపించని దారుల్లోంచి
పారదర్శకంగా చొచ్చుకుంటున్న శబ్దతరంగాల్లా
నదీతీరాన అంతులేని అలల పరుగుల్లా
వ్యాపించు... వ్యాపించు...
సాకారమయ్యే ఆలోచనల్ని మొలిపించుకుంటూ.
కనుగుడ్డుల చూపులు
కలియ తిరిగినంత మేర
వెలుతురు విరజిమ్ముతున్నట్టుగా
వ్యాపించు... వ్యాపించు...
దిగంతాల అంచులు తాకుతూ.
అనుదిన వ్యాపకంగా
విస్తరించడం... ముందుకు అడుగేయడం
ఎదుగుదలే కదా
వ్యాపించు... వ్యాపించు...

- దాట్ల దేవదానం రాజు, 99440105987