సాహితి

పద్యకేళీ లాలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందాన్ని అందంగా రాస్తే
డెందం పులకిస్తుంది
ఉత్పలాలను చంపకాలతో కలిపి
స్రగ్విణులకిస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు తేటగీతులు అల్లుకోవచ్చు
మూసలో పోసే సీసాలతో పనిలేదు
అచ్చమైన సీసం
మోసుకొస్తుంది అమృతం
శార్దూలాలతో ఆడుకోవాలనుకుంటే
మత్త్భాలపై ఊరేగాలనుకుంటే
పంచచామరాల వీవనలతో
భవ్యమైన సేవలను పొందాలనుకుంటే
లయగ్రాహిత్వం అవసరం
ఆటవెలదులకేమి కొదువ?
మత్తకోకిలలు కూసే చోట
ఉత్సాహంతో నర్తిస్తాయి
అందుకే మంగళ మహశ్రీ అంటూ
పొంగిపోతూ కవిత రాయాలి
సృజన కవిరాజ విరాజితమే కదా
మాలినీ చెప్పవే!
మహాస్రగ్ధరా! నోరు విప్పవే!
మలయజమా! సెలవీయవే!
కవి ఎప్పుడూ ధ్రువకోకిల అని!
రవిలా వాడెప్పుడూ
అమందాక్రాంతుడే అని!!

- డా. అయాచితం నటేశ్వరశర్మ 9440468557