సాహితి

కొత్త తరాన్ని స్వాగతించు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో, ఎనె్నన్నో
దిగులు కళ్లలో
దుఃఖ చలనాల వౌన నీడల్ని చూశాను
బావురుమనే గుండె ఏడ్పుల్ని విన్నాను
కొనిన వేల చావుల్ని చూశాను
స్పష్టా స్పష్ట రూపాలను వెతుక్కుంటూ
ఎందరివని ఓదార్చను?
అయనా ఎక్కడెక్కడో తిరిగాను
చీకటి బావుల్లాంటి కళ్లనీ చూశాను
దుఃఖ చారికల్ని తుడిచాను

ఆ కళ్ళలోంచి కారే
లోహాగ్ని ద్రవాన్ని తుడిచాను
శోక గుర్తులు చెరుగుతున్న వేళ
చలన సహిత తనువులో
విశాల మైదానాల వీపులమీద
స్మృత్యాగ్ని కణం కదలాడింది
దివ్య పుష్పాల ప్రాసాదాలు
ఆకాశ హర్మ్యాలు
యశో విలసిత దివ్యచింతనలో
ఆదిమ సమాజ ఆనంద హేల
ఒక శక్తి, ఒక చరిత్ర
ఒక సంస్కృతి జ్ఞాపకాలను
విత్తనాల్లా వెదజల్లుకున్నాను
సమాజ వృత్తంలోంచి
గిరులను, ఝరులను
వదలించుకొని, విదిలించుకొని
ఇప్పుడు కొత్త తరం
కొత్తదనంతో
లోపలి లోకాలను ఆవిష్కరించుకుంటూ
హర్ష సంచలిలో పద ధ్వనితో
కారు మేఘాల్లా కమ్ముకొస్తున్నారు
వర్షించనీ! వర్షించనీ!!
హర్షించు!
స్వాగతించు!!

- డా. ధేనువుకొండ శ్రీరామమూర్తి