సాహితి

కథా సంహితలు 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం ఒక సంయుక్త దేశంగా తీసుకుంటే, మనకు మంచి కథకులు వున్నారు. భాషలు ఎక్కువ, ప్రాంతీయతలు ఎక్కువ కనుక మనకు భాషా రచయితల, ప్రాంతీయ రచయితల పరిమాణం ఎక్కువ. ఒక భాష రచయితే ఆ భాష చదివే అన్ని రాష్ట్రాలలోను గణనకు రాడు; గమనానికి రాడు. విభేదాలు, వితరణలలో వున్న వ్యత్యాసాలవల్ల రుూ విపర్యయం జరుగుతుంది. ఒక భాష రచయిత యితర భాషల లోనికి తేలికగా అనువాదం కాడు. మాండలికం అడ్డం వస్తుంది. వస్తుప్రాధాన్యం కూడా గోడ కడుతుంది. జాతీయ స్థాయిలో కథా రచయితలు వున్నంతగా అంతర్జాతీయ స్థాయిలో మనకు అయిదారుగురు తప్ప ప్రసిద్ధమయిన రచయితలు లేరు.
ఎడ్వర్ ఎలెన్‌పో, సోమర్సెట్ మాఘం లాగ అంతర్జాతీయతలో చెప్పుకోదగ్గ రచయితలు మనకు లేరనడం మనను మనం కించపరుచుకోవడం అవుతుంది. కాకపోతే ఎక్కువమంది భాషారచయితలు అంతర్జాతీయ భాషలోనికి అనువాదం కాకపోవడం, బెస్ట్ సెల్లర్ పుస్తకాలుగా ప్రచురణ కాకపోవడం యిందుకు ప్రధాన కారణం. ‘మూల పదార్థం’ విరివిగా వున్న రచయితలు ప్రతి భాషలోనూ అసంఖ్యాకంగా వున్నారు. ఏ భాష యిందులో తక్కువ స్థాయికి చెందదు.
కథానికకు అవధులు లేవు. వస్తువులోగానీ విషయ ప్రాధాన్యతలోగాని ప్రేమ, ప్రణయం, సంసారం, సామాజికం, మానసికం, బౌద్ధికం, ఆత్మీకంగా కథ ఎంత దూరమయినా వెళ్లగలదు. విశ్వం అంతటినీ ఆలింగనం చేసుకోగలదు.
కథ కనిపించే జీవితానే్నకాక, కనిపించని ఊహాలోకం, ఆశల- అతిశయాల లోకంలో జరుగుతున్న విషయాలను కూడా యధార్థం అనిపించేట్లుగా రూపొందించగలదు. కట్టెలు కొట్టేవాడి కథే యిందుకు ప్రమాణం. ఇనుప గొడ్డలి, వెండి గొడ్డలి, బంగారు గొడ్డలిలలో దేనిని వాడు తనదని చెప్పుకున్నాడు? అబద్ధం అని తెలిసినా, తనకే స్పష్టంగా తెలిసినా అలా ఎందుకు ప్రవర్తించాడు? ‘దురాశ దుఃఖానికి చేటు’ అనే నీతి వాక్యానికి ఈ కథను ఉదాహరణగా చెప్పుతూ వున్నా, వాడికి దురాశ యేర్పడటానికి అవసరం అయిన సాంఘిక ప్రభావం యిక్కడ ప్రదర్శితం అవుతోంది. పక్కవాడి కన్నా తాను మిన్నగా వుండాలన్న కోరిక అతని మనస్సులో ఆవరిస్తోంది. బుద్ధిని ప్రలోభంలో పడేస్తోంది. ఆత్మక్షాళనం చేస్తోంది. పేదరికం-బీదరికం భౌతికస్థాయికి మటుకే పరిమితంకాదు. మనిషి అంతరంగాన్ని బయటకు తీసుకువచ్చే పరిణామం కథకు పుష్కలంగా వుంది.
సాహిత్య పరిణామవాదులు, ప్రతి రచయితలోను పూర్వ రచయితల ఛాయలు వెదకడానికి ప్రయత్నిస్తారు. పరిణామశీలతనే చూస్తారు తప్ప, పుష్పాన్ని గమనించలేకపోతారు. వెనకటి కథకు కొత్తరకంగా వేరే పరిమాణం తీసుకువస్తూ రావడం అన్ని స్థాయిలలోను సాధ్యం. గురువును మించిన శిష్యులు తయారవడం మనం ప్రపంచ పద్ధతిలో గమనిస్తూనే వున్నాం.
యదార్థతకు ఎంతో దూరంగా కథ నడుస్తూ వున్నా, యిది యదార్థం కాదు అన్న అనుమానం కూడా కలిగించని కథలు అనేకం వున్నాయి. నైతికతకు దూరం కానంతవరకూ, ఎవరూ రచయితను తప్పుపట్టరు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584