సాహితి
బ్లీడింగ్ పెయంటింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళమంత గంగాళంలో
మనిషి రక్తం మరగకాస్తున్న వాసన
సంపదల వేట, సంస్కృతుల తంటా
నరాంకానికి దించుతున్న తెర
నెత్తుటి పగ, రుధిర ప్రతీకార సెగ
శవాల గుట్టల కాటా, వాటాలు తేల్చే తూటా
చర్య, ప్రతి చర్యల దోబూచులాట
త్రివిధ తలాలలోనూ
తెగిపడుతున్న తలల ప్రేతకళ
తీరానికి కొట్టుకొస్తున్న శరణార్థి బాలల
విగత జీవ, ప్రశాంత వదన విషాద హేల
జనపాలన ఎగుమతిదార్ల నరమేధశాల నేల
ఉరికొయ్యల జాడ లేదని
జబ్బలు చరుచుకునే చోట
పరుల ఊచకోతల వ్యూహ రచన
చేయని నేరాలాపాదించి
జట్టుకట్టి మట్టుబెట్టే మంత్రాంగ చాలన
న్యాయాన్ని వీటో చేసే అభద్రతామండలి
అంతర్జాతీయ తోడుదొంగల కూడలి
హంతకుల గూటిలోని, గుప్పెట్లోని వాణి
నిస్సహాయ జంతుజాలాన్ని
చీల్చుకు తింటున్న
బ్లీడింగ్ పెయంటింగ్ ప్రపంచం
పెద్ద గద్దెలు కదిలాయ
చుట్టు బల్లను మూగాయ
ఉగ్రదండును అరికట్టాలని
అగ్ర దీక్ష బూనాయ
ధరాతలం నరనరాన
ప్రజల గుండె మంటల్లో పుట్టినవారు
జనక్షోభానల జన్ములు
ఆత్మత్యాగ దళాలు
వారిని కడతేర్చడానికి ఉమ్మడి సేన
వసుధ నెత్తిమీద టైంబాంబ్ కౌంట్‌డౌన్
లోక వల్లకాటికి కాపరులే కరువయ్యే సీన్
నిరంతర సిరుల వేటలో
ఇతరుల పాదాల కింద
భూమి కబళింపు
నిధుల తవ్వకానికి
స్థానికులనే బలి ఇచ్చే తెగింపు
నువ్వు విత్తిన మృత్యువే
ప్రసవిస్తున్నది నీ ముంగిట!