సాహితి

దుఃఖ యాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నీటి బిందువులను ఏరుకుంటున్నాను
నీకు నాకు మధ్య కొనసాగిన జ్ఞాపకాల నుండి
జారిపోయన జీవితాలను తాకుతున్నాను
నిన్ననటికీ నేటికీ మధ్య ఎడతెగని యాతన
పరిశోధించి మధించి నింపుకున్న జ్ఞానం
నా మెదడులోంచి కారిపోతున్న
అవాంఛనీయ అనుభూతి
రాత్రి కల నుండి
ఉదయానే్న నన్ను నేను తట్టి లేపుకునే వరకు
వెంటాడిన కలవరింత
కరువుతో ముక్కలవడం
మృత్యువును ముద్దాడడం కొత్తేమీ కాదు
కానీ,
తడి కోసం నీటి చూపుతో
నిరీక్షించడం నిజంగా కొత్తే
శబ్దాన్ని మోసీ మోసీ
నిశ్శబ్దంగా వుండలేకున్నాను
మీ పంచరంగుల జాతరల్లో
కనిపించని వెలిసిపోయన నా రంగు
ఒక దిగ్భ్రాంతి
వెనె్నల గాలుల్లో
వసంతోత్సవాలతో తెల్లారిన జీవితం
ఉరితాళ్లల్లో, పురుగు మందుల్లో
శాశ్వతంగా నిద్రపోతుంది
ప్రపంచ వాకిట్లో ఒప్పందాల
ముగ్గులేసుకున్నప్పుడే కదా
మన భూముల్లో చావు నాట్లు మొదలయ్యంది
ఇక పరామర్శలు పలకరింపులెందుకు?
ఎక్స్‌గ్రేషియాల కంటి తుడుపులెందుకు?
నిజంగా నాకు ప్రాణం కనిపిస్తే
రైతుల తలపాగాల్లో చుట్టి దాచిపెట్టేవాణ్ణి.

- ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, 9849082693