సాహితి

‘పంచమం’ పాఠ్యాంశం ఎట్లయింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ రచయిత చిలుకూరి దేవపుత్ర రచించిన ‘పంచమం’ నవలకు ప్రముఖ రచయిత ఎన్.వేణుగోపాల్, ప్రముఖ కవి కలేకూరి ప్రసాద్ ముందుమాట రాశారు. పాత్రల తోటి రాయలసీమ మాండలికంతో మాట్లాడించారు రచయిత. సెకండ్ క్లాసులో పాసయ్యే మొగోడు మా దగ్గరలో పుడితే ఇంకేమిలే అనే అవమానంతో మొదలయ్యే నవల ఆసాంతమూ మాల మాదిగల మీద భూస్వాముల అణచివేతను, పీడనను చిత్రించినట్లుగానే కనబడతాడు రచయిత.
నవల ప్రారంభంలో కథానాయకుడు మాదిగ శివయ్యను గ్రామం మొత్తానికి తెలివైన వాడిలా ప్రథమ శ్రేణి విద్యార్థిలా చూపించాడు రచయిత. చాలా సంతోషం. మాదిగ జాతి వృత్తిని పేదరికాన్ని పరోక్షంగా హేళన చేశాడు. చదువుకోకపోతే నీవు మీ అయ్యలాగే చెప్పులు కుట్టుకోవాలిరా శివయ్యా అంటూ ఎత్తిపొడిచాడు రచయిత. యుక్త వయస్సు వచ్చిన తర్వాత స్నేహితురాలు పద్మావతి అనే ఈడుగ కులస్తురాల్ని ప్రేమిస్తాడు. ప్రేమలో విఫలవౌతాడు. పద్మావతికి వివాహవౌతుంది. రెండవసారి ‘విద్యా’ అనే బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తాడు. మొహమాటం, ముందుకు పోలేని మనస్తత్వం శివయ్య పాత్ర. ‘విద్య’లాంటి సౌందర్యరాశులు తన కులంలోనూ పుడతారా?! ఏ వర్ణ సంకరమైతేనో తప్ప సాధ్యపడదా? విద్యలాంటి అందగత్తెని పెళ్ళి చేసుకొని అందమైన పాపల్ని కని తన కులంలోనూ సౌందర్య రాశులు వున్నారని లోకానికి చాటి చెపుతా. ఈ నలుపూ, ఈ మొరటుదనం, ఆహారాదులు కూడా సగం కారణం అని శివయ్య తన మనస్సులో ఆలోచించుకున్నట్టు రచయిత తన అభిప్రాయం వెలిబుచ్చారు. మాదిగ జాతిలోనూ అందగత్తెలున్నారు. సౌందర్యం ఒకరి సొంతం కాదు. సంకరం చెందితే కాని అందగత్తెలు పుట్టరా? డా. ఎండ్లూరి సుధాకర్ రచించిన నల్లద్రాక్ష పందిరిలోని ‘నీలిక’ కావ్యంలో మాదిగ సుందరి గురించి వర్ణించారు. అది చదివుంటే రచయిత ఈ మాట వ్రాసేవాడు కాదు.
రచయిత అనేక ఉద్యమాలను స్పృశించాడు. విప్లవ పార్టీలు, వామపక్ష సిద్ధాంతం, దండోరా, మాల మహానాడు మొత్తం ఉద్యమాలన్నీ విఫలమయ్యాయని పాఠకులను తప్పుదోవ పట్టించాడు రచయిత. శివయ్య పెద్ద చదువులు చదివి గ్రూప్-1 అధికారిగా ఉద్యోగం సంపాదిస్తాడు. దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేక, పెత్తందార్ల ఒత్తిడికి లోనవుతూ ఆఖరికి తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. తన కులపోల్లకి ఏదో చేద్దామని కలలు కంటాడు. ఏమీ చేయలేడు. అక్కడ నుండే ఇస్మాయిల్ పుల్లన్న, రాణి కుముదినీ ఇంకా అనేకమంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వచ్చి తన వృత్త్ధిర్మాన్ని సగౌరవంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా అనేకమంది మాదిగలు ఐఎఎస్ అధికారులుగా ప్రతిభావంతమైన పాత్ర నిర్వహించారు. వారిలో స్వర్గీయ కత్తి చంద్రయ్య, కె.ప్రవీణ్‌కుమార్, విద్యాసాగర్, రత్నప్రభ వంటివారు నిరుపమాన ప్రతిభావంతులు. జి. కళ్యాణరావు రచించిన అంటరానివారి వసంతం నవల ఆదినుండి అంతం వరకు ఎక్కడా రాజీపడకుండా పాత్రలని, సన్నివేశాలని విజయవంతంగా నడిపించారు. రచయిత దృష్టిలో మాలలు మాదిగల కంటే ప్రతిభావంతులని రాసుకున్నాడు రచయిత. అయితే రిజర్వేషనె్లందుకు పట్టుకు పాకులాడుతున్నాడు. ఓసిలతో పోటీపడి నెగ్గొచ్చు కదా.
‘పంచమం’ నవలను మూడు విశ్వవిద్యాలయాలు పి.జి. విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించారు. వీరు ఉన్నత విద్యావంతులు. భవిష్యత్తులో సమాజంలో ఉన్నత ఉద్యోగులుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వీరు ఇలాంటి విఫల నవలలు చదివితే నిత్యము భయపడుతూ బ్రతకాలి.
అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఇప్పుడు ఎవరి చరిత్ర, సాహిత్యము వారు రాసుకుంటున్నారు. మా గురించి ఆయన రాయాల్సిన అవసరం లేదు. రచయిత ‘పంచమం’ నవల కథానాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందినట్లు రాశారు. తన సామాజిక వర్గానికి చెందినవాడుగా రచయిత రాసుకుని వుంటే బాగుండేది. పంచమం నవల ఓ ఫెయిల్యూర్ స్టోరీ. మేధావి వర్గం కుట్ర చేసి విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశంగా నిర్ణయించడం బాధాకరం. ఈ నవల వలన భవిష్యత్తు మేధావులకు భంగపాటే.

- డి.ఎజ్రాశాస్ర్తీ, 8096225974