సాహితి

వేటూరి వారి ‘నీతి నిధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటూరి ప్రభాకరశాస్ర్తీ పారం ముట్టిన పండితులు. ‘బాలభాష’ అనే వీరి పుస్తకం కొందరకు తెలుసు. కాని వీరి అనువాదగ్రంథం ‘నీతి నిధి’ అనేది చాలాకొద్దిమందికే తెలుసనుకుంటాను. 1926లో ఆంధ్ర పత్రికా కార్యాలయంవారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ముందుమాటతో ఈ నీతినిధి ప్రచురింపబడింది. కాశీనాథుని నాగేశ్వరరావుగారు సంపాదకీయంలో ఇలా పేర్కొన్నారు- ‘‘శ్రీ నీతినిధి ఆంధ్ర గ్రంథమాలయందాఱవ కుసుమము. గ్రంథమాంగ్ల గ్రంథమునకనువాదము. నీతినిధి సకల జనులకును పారాయణ యోగ్యముగనున్నది. జీవయాత్రకు నీతిసాధనము నీతినిధి. ప్రతి మనుజునుకును వెంటనుండదగిన ధర్మ మిత్రము. ఆంగ్లంలో దీనికి ‘‘ది ఎకానమీ ఆఫ్ హ్యూమన్ లైఫ్’’ అని పేరున్నది. ‘మానవ జీవిత నిబంధనము’ అనుట దానికి సరియిన తెలుగయినను ఆ పేరంత ససిగా లేదని ‘నీతినిధి’ యని మార్చితిని’’ అని ప్రభాకర శాస్ర్తీ గారు ముందుమాటలో పేర్కొని మన ప్రాచీనులు ఇటువంటి వాటిని నీతిశాస్త్ర గ్రంథాలనటం తెలిసిందే అన్నారు. క్రీ.శ.1751 నుంచి 1812 వరకు ఈ గ్రంథం ఆంగ్ల భాషలో ఏభైసార్లు ముద్రితమైందనీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో ఆయా భాషలలోకి పరివర్తితమై ప్రచారం పొందెననీ ప్రభాకరశాస్ర్తీ తెలిపారు. ఇంతకీ ఆంగ్ల గ్రంథకర్త నామం గుప్తం. మూల గ్రంథ రచయిత చైనీయుడని కొందరు అభిప్రాయపడినా చర్చనీయాంశమే అంటారు వేటూరివారు. 1749లో ఆంగ్లానువాదకర్త చస్టరు ఫీల్డు ప్రభువుకు రాసిన ఉత్తరానికి తెలుగు అనువాదం కూడా గమనిస్తాం. మానవుని ధర్మములు, మనోవికారములు, రక్తసంబంధము, మనుష్యులలో దైవికములయిన తారతమ్యములు, సాంఘిక ధర్మములు, మతము అనే ఏడు అధ్యాయాలు మొదటి భాగంలో ఉన్నాయి. రెండో భాగంలో మానవ సామాన్య విషయములు, మనుష్యుని మనోవికారములు- వాని దోషములు, స్వపరానర్థములగు వ్యామోహములు, మనుజుడు తోడి వారి మీఱి పొందదగిన దొడ్డ గుణములు. తప్పించుకోరాని దైవికములు అనే అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాలలో ఉపభాగాలున్నాయి. ఉదాహరణకు తప్పించుకోరాని దైవికములు అనే అధ్యాయంలో లాభనష్టములు, వ్యాధి- బాధ, మరణము అనే భాగాలున్నాయి. వేటూరి వారి భాష గ్రాంథికమే గాని చదివినపుడు స్వతంత్ర రచనగానే కనిపిస్తుంది తప్ప అనువాద రచనగా భావింపలేం. కొన్ని ఆణిముత్యాలు చూడండి- ‘‘బాదముపప్పునాతడు తినగోరునుగాని దాని పెంకును పగులగొట్టుటకు ప్రాలు మాలును’’, ‘‘నీ నాలుకకు కళ్ళెము కట్టి యుంచుము. నీ పెదవులకు ముందు రక్షయుంచుము. వదరుబోతుతనము పశ్చాత్తాపమునకు హేతువగును. వదరుబోతు సంఘమునకు వ్యధ కల్గించును’’.
‘‘నీ బిడ్డడు నీకు మేలునో కీడునో చేయువాడగుట, సంఘమున ప్రయోజకుడుగనో యప్రయోజకుడుగనో యగుట నీ చేతనున్నది’’. ‘‘్ధర్మాత్ముని చేయి భూమిపయి పూవులను పండ్లను పైరులను వెలయించు నీటి మబ్బు వంటిది. కృతఘు్నని హృదయము వర్షోదకమునెల్ల దిగమ్రింగి తనలోనే యడంచుకొని నిష్ఫలమొనర్చు నిసుకయెడారి వంటిది’’. ‘‘నీకు లోబడియున్నదన్న కారణమున నీ భార్యను నీచముగా జూడకుము. నీ సౌశీల్యమునెడగల్గు నమ్మకము చేతనే యాపె (ఆమె) నీకు లోబడెను’’.
ఇలా అన్ని భావజాలాలూ ఈ పుస్తకంలో కనబడతాయి. నూరేళ్ళ క్రితమే భార్య గురించి స్ర్తివాద ధోరణిలో చెప్పబడటం విశేషం. చర్చకు దారితీసే ప్రకటనలూ ఉన్నాయి. మచ్చుకి- ‘‘దరిద్రుడు మంచితనము పొందుట కొక సుగుణమావశ్యకము. అది యోరిమి. ఔదార్యము, పరిమితత్వము, వివేకము మొదలయిన సుగుణములు లేకుండు ధనికుడు పాపిష్ఠిడు. ఈ తరానికి వ్యక్తిత వికాసాన్ని ఎరుకపరిచే సుభాషితాలు చాలా ఉన్నాయి. మరణం గురించిన సూక్తులు జీవిత పరమార్థాన్ని వెల్లడిస్తాయి. చావుపై భయాన్ని పోగొడతాయి. ఈ పుస్తకాన్ని పునర్ముద్రించవలసి వుంది. అయితే వాడుక భాషలోకి మార్చాలి. లేదా క్లిష్టమైన, వాడుకలో లేని పదాలకు అధోజ్ఞాపికల్లో అర్థాలు, వివరణలు ఇవ్వాలి. తెలుగు నీతి శాస్త్రాలలో ఈ నీతినిధి పెన్నిధి.

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376