సాహితి

విశ్వకవి భావనా విస్ఫూర్తి... గీతాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర కవిత్వంలో భావ కవితా యుగంలోనూ అంతకుపూర్వం సంఘ సంస్కరణ కవిత్వం, దేశభక్తి కవిత్వం ఆవిర్భవించిన సమయాల్లో రవీంద్రుని ప్రభావం బలంగా ఉంది.

భారతీయ భాషలన్నింటిపైనా రవీంద్రుని ప్రభావం ఉంది. సమకాలీన తెలుగు కవులను నూరుశాతం ప్రభావితం చేసిన కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఆ దారిని అనుసరింపజేసిన ఘనత వీరిది. ఇది ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన విశేషం. ఒక్క గీతాంజలితోనే రవీంద్రుడు కవి హృదయాల సమస్తాన్ని దోచుకున్నాడని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి మనసుకు శాంతినిచ్చే పచ్చని చెట్ల నీడలోని చలివేంద్రం ‘గీతాంజలి’.
ప్రపంచ సాహిత్య ప్రపంచానికి భారతీయ సాహిత్యపు విలువలను రుచి చూపించింది రవీంద్రనాధ్ ఠాగూర్. రవీంద్రుడనగానే గుర్తొచ్చేది అతనికి 1913లో నోబెల్ బహుమతిని తీసుకొచ్చిన గీతాంజలి. జీవితం ఎంత దుర్భరమైనా, క్లిష్టమైనా, సంఘర్షణతో నలిగినా మనిషి మనస్సు సేద తీరేది, తీర్చగలిగేది లలిత లాలిత్య సౌందర్యం ఒక్క ప్రకృతిలోనే. ఇది సర్వకాలీన సత్యం. ప్రభాత సమయంలో ఉదయించే సూర్యుడు, ఆహారం కోసం గగనంలో బయలుదేరిన పక్షుల వంపుల గుంపులు, మిట్టమధ్యాహ్నం ఆకాశంలో గరుడుడి శాంతి తపస్సు, సాయం సంధ్య, మునిమాపు గోధూళి వేళలు, ప్రవహించే జలపాతాలు మొదలుకొని పిల్ల పంట కాలువలు సముద్ర నదీ జలాల మీదుగా వచ్చే పచ్చని పైరుగాలులు పుడమి తల్లి ప్రసవ వేదనతో బయటకు వచ్చే పచ్చదనపు మొక్కలు, అడవులు మొదలుకొని ఇంటి పెరడులోంచి వచ్చే పుష్ప పరిమళాలు, కుండపోత మొదలుకొని ఇంటి తాటాకు చూరునుండి వచ్చే చిరుజల్లుల సౌందర్యం, ఒక్కమాటలో కరుణకు, ఆర్ద్రతకు, మానవ హృదయం స్పందించినంతకాలం ఠాగూర్ సాహిత్యం అమరమే.
దివ్యలోకాల్నుంచి వినబడుతున్న మనోమయ సంగీతం భువికి అలలు అలలుగా తేలి గాలిలో కలిసి కిందకు దిగుతున్నట్లుగా వినిపించే సంగీతంతో, పాటతో, సకల చరాచరంతో కలగలసిన లయబధ్ధమైన రాగాల్ని గుర్తిస్తూ, తనకి తెలియకుండానే వెంటాడుతున్న రాగాజలనిధిని అభిషేకిస్తూ పాడమని అని నీ ఆజ్ఞ అని అనంతానంత శక్తికి విన్నవిస్తాడు. లోకమంతా.. మనుషులంతా.. ప్రకృతి, సూర్యచంద్రాదులు, ఆకాశము అంతా లయబద్ధమైన సంగీత ఝురిగా విన్నవిస్తూ పాటే జీవుల్ని నీ దగ్గరకు జేర్చే ‘దరి’ అంటాడు.
‘‘నీగానంలో కలవాలని నా హృదయం ఉవ్విళ్ళూరుతోంది కాని కంఠస్వరం కలవక తల్లడిల్లుతోంది.
మాట్లాడాలని చూస్తాను. మాటలు పాటలుగా సాగక దిగ్భ్రమతో కేకలు పెడతాను’’
అంటే లేని నీ గాల జాలంలో నా హృదయాన్ని కట్టివేసావు’’
(్ఠగూర్ గీతాంజలి- చలం తెలుగు అనువాదం. పుట:38)
ఈ నాలుగు పంక్తుల్లో అద్వితీయమైన మార్మికత, విస్తృతార్థం, ఎంత క్లుప్తంగా పొందుపరచబడ్డాయంటే ఆత్మతత్వాన్ని ఊహలకి అందే వస్తువుగా అనుకోవడం, ఆత్మని దర్శించుకోవాలనే తహతహలాడే వాళ్ళు అనంత భావనలో కదలాడుతారు. పారదర్శకమైన స్ఫటికంలా ఒక వెలుగుని, చైతన్యాన్ని దృశ్యం లేకపోయినా అలౌకిక శుద్ధ చైతన్య సంవేదనంతో అనంత తత్వంలో చలిస్తూ ఆ లయలోనే కలవాలని ఉర్రూతలూగుతారు.
ఆధునికాంధ్ర కవిత్వంలో భావ కవితా యుగంలోనూ అంతకుపూర్వం సంఘ సంస్కరణ కవిత్వం, దేశభక్తి కవిత్వం ఆవిర్భవించిన సమయాల్లో రవీంద్రుని ప్రభావం బలంగా ఉంది. క్రమక్రమేణా తెలుగు కవిత్వం తనదైన సొంత బాణీలను ఏర్పరచుకోగలిగింది. శ్రీశ్రీ కవిత్వ ప్రవేశంతో కవిత్వం కొత్త పుంతలు త్రొక్కింది. ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ, దిగంబర, విప్లవ కవిత్వాలే అందుకు నిదర్శనం. ఆ తర్వాత స్ర్తివాదం, ముస్లిం వాదం మొదలైనవి ప్రపంచంలో మారుతున్న సాహిత్యానికి, బలహీన వర్గాలు తమ అస్తిత్వాన్ని వినిపించడానికి ప్రాంతీయ వాదాలు తెలుగులో చోటుజేసుకున్నై. అయితే ఈ ధోరణులు ఒకదానికొకటి కొనసాగింపు కాదు. ఆయా సందర్భానుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దూసుకొచ్చినవి. ఈ ధోరణులలో కొన్ని ప్రస్తుతం కూడా కొనసాగుతున్నవే! సమాంతరంగా ప్రవహిస్తున్నవే! సమగ్రంగా పరిశీలిస్తే ఇంతకుముందు దశాబ్దాలకంటే కూడా కవిత్వం ప్రజలకు ఎక్కువ చేరువైనట్టు తెలుస్తుంది. నేడు నెలకొన్న అనేక వాదాలతో రవీంద్రుని ప్రభావం దాదాపు అంతరించిందనే చెప్పవచ్చు. కానీ భారతీయ భాషలకు ఒక దిశా నిర్దేశము చేసి, ప్రాచీన సాహిత్య ఒరవడిలో కొట్టుకుపోతున్న మన కవిత్వాన్ని ఆధునికత వేపుకు తిప్పిన కవిగా రవీంద్రుని స్థానం శాశ్వతం.

- బులుసు సరోజినీదేవి, 9866190548