సాహితి

గాయం ఎప్పుడూ కొత్తదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకాల మెట్లమీదికెళితే
ఆ మహాగాయం
కన్నీటి దొంతరను ఒరుసుకొంది కోసారి...
అంతర్ధానం కాని దృశ్యాల
పచ్చి ఇంకా ఆరనే లేదు
దిగుడుబావిలో ఏదో మూల
జీరగొంతుల సన్నని అరుపులు ఆగనే లేదు
ఉసురుతీయడమే తెలుసు గాయానికి
పువ్వెంత మెత్తగా ఉన్నా
కత్తికి కనికరముండాలి కదా!
లోయలకు దిగబడి కసిగా కోయడమే
గాయానికి తెలిసిన ఏకైక మహాకార్యం
ఎప్పుడూ కొత్తగానే వుంటుంది గాయం
బతుకంటే ఏమిటో తెలిస్తే
అది గాయమెలా అవుతుంది...?
మలుపుల్ని మెలిపెట్టి తన ఆర్తిని
వికృతంగా రంగరించుకుంటుంది
మహమ్మారో, జడజ్జంత్రో తెలియదు
ఆ జడికి
చరణాలు తడబడతాయి
వాక్యాలు తెగిపోతాయి
ఆలోచనలు ఆగిపోతాయి
నిర్మాణాలు స్తంభిస్తాయి
నడకలు గతి తప్పుతాయి
నడతలు చెల్లిపోతాయి
అనుబంధాలు ఆరిపోతాయి
ప్రకోపాలు పెచ్చరిల్లుతాయి
ప్రపంచ యవనిక పట్టుతప్పుతుంది
ఐనా గాయం మళ్ళీ కొత్తగానే కన్పిస్తుంది
పై మెరుగులు వెదజల్లినట్టు
భ్రమావరణాలను సృష్టించి
వేకువల్ని పొడిచేస్తుంది
తన్లాటల్ని మిగిలిస్తుంది
బతుకు గతుల్ని వెక్కిరిస్తున్న గాయం
మనం ఎక్కడో పారేసుకున్న జీవన తాత్పర్యం
గాయం ఒక అత్యయిక సందర్భం
ఆదమరపుల కనురెప్పలపై ఉద్విగ్నపు క్షణం
గాయం ఒక పాఠం
గాయమే జ్ఞాననేత్రం
గాయం మహా జీవన వ్యాకరణం
గాయం పరిశోధించాల్సిన గ్రంథం
మానిన తరువాతే అది మందహాసం

- తిరునగరి శ్రీనివాస్, 9441464764