సాహితి

పాదముద్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకు రాలినా
ఆ చెట్టెన్నడు దుఃఖించదు
కొత్త అనుభవానికి
చిగురు కవాటాన్ని తెరుస్తది!

నేనంతే
ఎన్నిసార్లు గాయపడినా
కించిత్ ఖేదపడను
కొత్త అనుభూతిని ఒడిసిపడతా!

ప్రవహిస్తుంటేనే కదా
తగిలేది అడ్డంకులు
అధిగమించంది
నేను నదినెట్లవుతా?

శిఖరంమీద
నుంచున్న వానికి
నేలమీది మనుషులు
చీమల్లా అగుపిస్తరు!

దూరం విస్తరిస్తుంటే
భూమీది వానికీ
ఎంతెత్తునున్నోడైనా
కొండెక్కిన దీపమే!

అకస్మాత్తుగా
ఆకాశమెత్తు ఎదగడం
అర నిముషంలో కుప్పకూలటం
ఎన్నిసార్లు చూడలేదు!
నీ యాత్ర పొడవెవనికి కావాలి?
ఈ మట్టి మీద
నీ పాదముద్రల
సంతకాల దాఖలాలేవి?

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 9440233261