సాహితి

‘కవితా నిర్లక్ష్యం’.. ఓ జాడ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం పట్ల లక్ష్యం లేదా పూనిక లేకపోవటాన్ని నిర్లక్ష్య కవిత్వం అనవచ్చు. లేదా కవితా నిర్లక్ష్యం అనవచ్చు. కొంచెం లోతుగా ఆలోచిస్తే నిర్లక్ష్య కవిత్వం2- కవితా నిర్లక్ష్యం22 రెండూ ఒకటి గాదు. 3నిర్లక్ష్య కవిత్వం2 కన్నా3కవితా నిర్లక్ష్యం2 ఒకింత ప్రమాదకారి. దేన్ని పడితే దాన్ని కవిత్వం అనుకొని పేడ అలికినట్లు అలకటం 3నిర్లక్ష్య కవిత్వం. అలికిన ప్రతి పేడ పులుముడ్ని కవిత్వమని బుకాయించడం 3కవితా నిర్లక్ష్యం. తెలుగువారికి ఈ జాడ్యం బాగానే అంటుకుంది. బాగానే కాదు.. బలంగా అంటుకొంది. వ్రాయాలనే తీట (చీడ) ఇపుడు కవిత్వమనే కల్పవృక్షానికి పట్టింది. కవిత్వాన్ని ఏ భావనా బలం- ఏ గురువు ఉపదేశం ఏ పరిసరాల అండ; ఏ స్పృహ; ఏ అనుశీలనాది యోగ్యతల్లేకుండానే చెపుతున్న- చెప్పవచ్చునంటున్న తెలుగు కవికుంఠుడు ఎంత అధమ స్థాయి ప్రమత్తుడో అర్థం చేసుకోవాలి. అకవులను కవులుగా నెత్తికెక్కించుకుని ఊరేగేవారినింకా ఏమనాలో తెలుసుకోవాలి. ఈ పరిస్థితిలో పుటలు విప్పుకున్న కవిత్వానికి అర్థం చెప్పమని అడగటం అర్థం కావటంలేదని బలాత్కరించటం ఒక విధమైన జాంతవ లక్షణం. కవితా సౌందర్యాన్ని బుజ్జగించి కైవసం చేసుకునే సుకుమార హృదయ సంస్కారాన్ని సహృదయ సమాధి స్థితి అంటారు. ఇది కవికెంత ముఖ్యమో- పాఠకుడికి అంతకన్నా ముఖ్యం. ఇదిప్పుడు దొరకని వస్తువైంది. ఈ వస్తువుని దొరకబుచ్చుకోవటమన్నది శ్రమాధిక్య సాధన అయింది. వర్తమాన కవి ఈ శ్రమపడలేడు. కవిత్వాన్ని చదివే శక్తిని మనం కోల్పోవటమన్నది ఒక స్థిరపడిన లక్షణమేమో ఆలోచించుకోవాలి. కవిత్వ భాష మామూలుగా మనం నిత్యనైమిత్తిక జీవన విధానంలో వాడే భాషకన్నా భిన్నంగానే వుంటుంది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇది యధార్థం. ఇటీవల ఆంధ్రభూమి సాహితిలో అచ్చైన ఒక కవితను చదివాను. మకుటం 3దృశ్యాదృశ్యాలు2 (సాహితి 12-12-2016)
3కొండ కొసని ఎఱ్ఱనిదొక పువ్వు
మంచుమీద మణికార్ముకాన్ని వంచి
తోట బాటమీద తొడిమ నీడలల్లుతోంది22
ఈ ప్రారంభ పదాలన్నీ మృదుగీతికా పరిణత ధ్వని వైఖరితో పఠిత హృదయ తంత్రుల్ని మీటి సహస్ర ప్రకంనాలతో పిసాళించి ఉత్తమ సారస్వతా లక్షణాలన్నింటిని గర్భీభూతం చేసుకున్నాయి. 3తొడిమనీడలన్న విశిష్ట పద ప్రయోగం చర్మ చక్షువులకన్న, అంతర్నేత్ర దృక్కుల్ని రసప్లావితం చేస్తుంది. పునర్దర్శన సౌందర్యంలో తేలి మనసు రంగుల మేళా అవుతుంది. ఇక్కడ కవి తానుగా ముందు కలగజేసుకుని, స్వీయ హృదయ రాగాలన్నీ అలౌకిక శోధనలన్నీ వెలికితెచ్చి కుప్పపోయలేదు. స్థూల దృష్టికి గోచరమయ్యే సుప్రభాత దృశ్యాన్ని పదాల పోహళింపుతో సాక్షాత్కరింపజేసిన ఒక అలౌకిక అదృశ్య వృత్తం దర్శనమిస్తోంది. ఇంత శక్తిని ఈ కవి సాధించటం జరిగింది కదా అని తార్కిక బుద్ధితో విశే్లషించుకుందామా అంటే సాధ్యపడదని తెలుసుకున్నవాడు ఉత్తమ పాఠకుడవుతాడు. తర్కానికి కవిత్వానికి సమన్వయం కుదరదు. ఎక్కడ తర్కం తలెత్తుతుందో అక్కడ కవిత్వం నిష్క్రమిస్తుంది. ఎందుకంటే కవి అభివ్యక్తికి ధ్వనికి మధ్య అంతరికానుబంధం వాచ్యం కాలేదు కనక ఇక్కడ తర్కానికి చోటులేదు. కవి ప్రయోగించిన పదాలన్నీ స్థూలంగా సాధారణమైనవే. అల్పమైనవే. కానీ వాటి కవితా నిర్మాణంలో అనల్పార్థ సందోహాన్నందుకున్నాయి. ఈ పదాలు చూడండి.. వినూత్న సంవిధానం ద్వారా ప్రతి వాక్యమూ ఒక మనోహర భావ చిత్రంగా రూపొందటం గమనించగలం.
34తడబడి ఏ బిందువు ఎందుకు జారిందో
తెమలని మునుకల బడి - ఈ
తఱగని వాగునిలా ఈదుతునే వుంది22
పదాలకు ఇక్కడ ప్రాణారోపణం జరిగింది. జాగర్తగా గమనించండి. సంసారమంతా తరాలనుండి సాగుతున్న అతి సాధారణ వ్యవహారం. సామాన్య శబ్దాలనుండి అసామాన్య అర్థాలను ప్రతిపాదించటం జరిగింది. 3తఱగని వాగు2 కీలకమైన పదం. ఈ పదం కలిగించిన స్ఫురణ 3తఱగని వాగును వాచ్యం చేయకుండా కేవలం ధ్వని ప్రధానంగా సంయమితమైంది. ఈ పద చిత్ర సంజ్ఞల ద్వారా ప్రతీకల ద్వారా లోకవృత్త విశే్లషణ జరిగింది. ఒక జీవ సంపర్క యోగ సాధన ప్రతిష్ఠ చేయబడింది. ఇట్లా ఈ కవితను విశే్లషించుకుంటూ పోవటం ఈ వ్యాసోద్దేశం కాదుగనుక ఆపేసి- అసలు విషయానికొద్దాం.
కవిత్వం చదివే శక్తిని కోల్పోవటమన్నది ఒక స్థిరపడిన లక్షణం గా అయిపోయిందని పైన అనుకున్నది అసలు విషయం. కవిత్వం రమణీయ చిత్కళగా రూపొందింపబడాలంటే ఏ రంగులు; హొరంగులు అవసరమో నిత్య ప్రయోగశీలతతో పరిశోధించాలి. పాఠకుని ప్రజ్ఞ ఇక్కడే ప్రామాణికతను స్థిరపరచుకుంటుంది.
ఇది భాషాపరంగా అన్వయించుకుంటే ప్రతిభావంతునికెదురైన భాష ఎంత సనాతనమో అంత అధునాతనంగా భాసించి చిరంతన దీప్తి కలిగిస్తుంది. అలవాటులో అభివ్యక్తిలో పాతబడిన మాటను ప్రతిభావంతుడు సమూలంగా కుదిపి తిరిగి కలిపి నవ (జీవన) శక్తిని ప్రతిపదిస్తాడు. అనుభూతిని చీల్చుకుని ఆకారం ధరించి వస్తే సూర్యోదయంలా వస్తుంది. ఆవరణను పెంచుకున్న ఆధునిక కవిత్వంలో భాష- భావం రెండూ అయోమయమైపోయాయి. అనవగాహనతో ఆధునిక కవిత్వం ఎలా వ్రాసినా చెల్లుబాటు అయే అంగీకారమైంది. ఏ సంవిధానంగానీ- ఏ స్వరూపంగానీ- స్వభావ సంబంధమైన సురభిళాలతో తప్ప గాలిలో బ్రతకదు. స్వభావమిప్పుడు అక్షరాలు వ్రాసే అంటుజాడ్యమైంది. ఇందులో అనుభూతి తాదాత్మ్యత అసలుండనే వుండదు. అనుశీలనమున్నూ వుండదు. పోరంబోకు నేలల్లో పంట పండదు. అంటే మట్టిబుఱ్ఱలో తలపోత ఇగురెత్తదని అర్థం. కారణం- కవిత్వంలో కవితాభివ్యక్తి వుంటుంది. కానీ- వ్యక్తిగత అభిప్రాయాలంటూ పొడి మాటలండవు. ఉంటే అది కవిత్వం కాదని నిష్కర్షగా చెప్పొచ్చు. అసలు కవిత్వమంటేనే బింబాత్మక భాష. కవిత్వంలో కేవలం అభిప్రాయం మాత్రమే స్ఫుటంగా కనిపిస్తే అది సాహిత్యేతరమైన విషయం. ఇది మాత్రమే కాదు; కవిత్వానికి వర్గీకృత నామధేయాలు చేయటం అసాహిత్య ప్రక్రియ. నిజానికటువంటి ధోరణిని వ్యతిరేకించాలి. కారణం అది కేవలమైన అజ్ఞానం, ఆపైన మూఢత్వం. పిదప అహంకారం. తర్వాత పిచ్చి తలకెక్కటం. కడకు కావ్యస్తం కావటం.
ఈ వర్గీకృత నామకరణ మహోత్సవం అభిధేయం కాదు. ఏ జాతి చరిత్ర ఒక సాహసోపేత యాత్ర కాదో- ఏ జాతి నిశ్చల నిద్రాప్రాయమైన పారతంత్య్రాన్ని ఆహ్వానిస్తుందో- ఏ జాతికి స్వభావతః లజ్జ లేదో ఏ జాతి మాతృగర్భం నుంచి బైటపడుతూనే ఒక యజమానికోసం వెతుక్కుంటుందో- ఏ జాతి స్వలింగాభిమాన పరిబోగ యశస్సును ఉద్యమంగా ఆహ్వానిస్తుందో అటువంటి జాతికి సాహిత్య సృజనకు కావాల్సిన ప్రాణధాతువు లేదనే అర్థం. ఆ జాతి సాహిత్య స్పర్శకు కూడా అనర్హమైనదే. కేటాయింపులకు క్రేళ్ళుఱికే జాతి ఒకటి ఈ దేశంలో సాహిత్యాన్ని ఖండ ఖండాలుగా నఱికి పోగులు పెట్టింది. కవిత్వపు ఉత్తమ ప్రయోజనం అనే ప్రజా శ్రేయస్సు ఉత్తమ కవిత్వం మనకు ప్రదానం చేసిన అర్థోత్పత్తి చేతనే సాధించబడుతుందనే దృక్పథం వర్తమాన మానవీయ సభ్యత. ఈ సభ్యత సాహిత్య పక్షాన గుర్తింపబడవలసిన ఒక మహాసత్యం. కవిత్వం ఏ ఆకర్షణీయ భాషో ఏ అలంకార భాషో ఏ ప్రతీకల భాషో, అర్థవంతమైన ఏ బింబాత్మక భాషో ఆ భాషా విశేషంగానే ఆ సాహిత్యాన్ని ఉండనీయాలి. కవిత్వప్రాణమైన పై విషయ విశేషాలన్నింటిని సాహిత్య స్రష్ట అనుభూతి జ్వాలల్లోంచే పోగుజేసుకుంటాడు. ఊహ అనుభూతి కాదన్నది సహృదయలు గమనించాలి. అలంకారం అయిన సాహిత్య భాషకే ఆకర్షణ శక్తి వుంటుంది. అలంకారాలు లేని రోజువారీ వ్యవహార భాషకు అంటే సాధారణ భాషకు ఆకర్షించే శక్తి వుండదు. అది ఎప్పటికప్పుడు పని గడుపుకు పోవటానికి మనిషి దైనిక జీవితంలో వాడుకునే ‘బల్ల’ ‘కుర్చీ’ ‘గుండీ’ ‘గినె్న’ ‘పెన్ను’ లాంటి వస్తువు కనుక ప్రజా శ్రేయస్సు కోరేవాడు, ఉద్యమం వాంఛించేవాడు, కేటాయింపులు కావాలనుకునేవాడు, సామాజిక స్పృహరో అని కరభ ఘోషణగా నినాదాలు చేసేవాడు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఆకర్షించే శక్తి వున్న భాషకే ప్రయోజనాలను సాధించగలిగిన శక్తి వుంటుందని. అదే అలంకార భాష అని- దాని పేరే కవిత్వమని గ్రహించాలి. ఈ ఓపిక లేనివాడు సాహిత్య స్పృహని కోల్పోవాలి. వాడు మరొక పని చేసుకుంటూ జీవనం వెళ్ళబుచ్చాలి. అలంకారాల్లేని- అందుచేత ఆకర్షణ లేని ఖండిత వచనాలు ‘అసాహిత్య’ప్పొల్లు కనుక ఎవర్నీ ఆకర్షించదు. ఆకర్షించలేని మాటలు హృదయ పరివర్తన కలిగించవు. హృదయ పరివర్తన లేకపోతే ప్రజా చైతన్యం లేదు. ప్రజా చైతన్యం లేకపోతే ప్రగతి లేదు. ప్రగతి లేకపోతే అది పాపిష్టి బ్రతుకే. ఇంత దారుణమైన ఈ నిష్ఫల - నికృత - నిఘర్ష కవితా ఘోష కేవలం ‘కృమికులచితం లాలాక్లిన్నం’. ఇదేమీ తిట్టూ కాదు; తిమ్మూ కాదు. యధార్థ స్థితి. ఎంత నిజమంటే గడచిన కొన్ని దశాబ్దాలుగా కవులమని చెప్పుకునే ఒక వర్గానికి వున్నదంతా అవిద్యే.
చాలామంది తెలుగు కవినామక చక్రవర్తులు అధ్యయనం ప్రతిభను ఆచ్ఛదితం చేసి కవి సృజనాత్మక శక్తిని నాశనం చేస్తుందనే అజ్ఞాన రోగాన్ని పరివ్యాప్తం చేశారు. తత్‌ఫలితమే అప్రగల్భ భావ సంకేతాలు అచ్చయి ఆర్భటిస్తున్నాయి. వస్తువును స్వీకరించటం దగ్గర నుంచి దానిని కవిత్వీకరించే వరకు నీతిని కోల్పోయి నిర్వీర్యమైన జాతిగానే కవులున్నారు. దేన్నో అనైతికంగా ఆశిస్తున్నారు. ఆ ఆశించినదాన్ని ప్రతిష్ఠాత్మకంగా కనిపింపచేయాలని చేసే వికృతాభినయమే పరమ హేయంగా వుంటోంది. అసలు విషయమంతా ఇంత అధ్వాన్నం కావటానికి కారణం కవిత్వానికి భాష స్థూల శరీరం అని తెలియకపోవటం. తెలియాలంటే ఆధునిక కవులు తప్పకుండా చదువుకోవాలి. చదువుకోకుండానే ఇంత కవిత్వం వ్రాశారా అంటే ఆ చదువు కుర్చీలున్న గదిలో కూర్చుండటానికే. అదొక బ్రతుకుతెరువుకైన భాజనం మాత్రమే. అక్కడ కూర్చొని వ్రాసేది కవిత్వం కాదు. అందులో ఏ విధమైన రసము ఉండదు. ఆ అక్షరాల్లో మిగిలింది నీరసం- ఆ వాక్యాలన్నీ శుష్కకాష్టాలు. ఇట్టివి కావ్యాపకర్ష హేతువైన ఒక దోషమని తెలుసుకోవాలి. ఈ విధమైన నీరస రచనలు ఆది మధ్యాంత రహిత స్థితిలో కొనసాగుతూనే వున్నాయి. ఈ దుస్థితినుంచి నేటి కవిత్వం కాపాడబడాలి. ఈ జబ్బు ముసుగులు మార్చి మార్చి వ్యాపిస్తోంది.
ఎన్నో ఏళ్లుగా ఈ వీరవిహారం ఏ భయము లేకుండా నిశ్చింతగా సాగిపోతూనే వుంది. ఒకడి అకాల అకారణ కీర్తి, ఆ వేషధారణకి లొంగి అంటువ్యాధిలా అంతటా అలముకొంది. ఇదింకా ఇలాగే కొనసాగితే అచ్చుపోసిన ఆబోతుల్లాంటి అచ్చరాలు తప్ప ఈ దేశం ఏమీ మిగుల్చుకోదు. ఇక ఊపిరాడక కవిత్వం కాలం చేస్తుంది. ఇప్పటికింకా కవిత్వానికి జబ్బు మాత్రమే చేసిందని సమాధానం చెప్పుకొన్నా ఇవాల్టి ఈ సమాధానం మళ్లీ రేపు అవకాశపు హక్కుతో అరాచకానికి ఆస్పదవౌతుంది.

- సాంధ్యశ్రీ, 8106897404