సాహితి

పల్లెకు దూరమవుతున్న పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమజీవుల చెమటల్లోంచి పుట్టిన శబ్ద చిత్రం సాహిత్యానికి, కళలకు మూలమైంది. ఏ సమాజంలోనైనా
భాషా సాహిత్యాలకు జవసత్వాలిచ్చేవి స్వచ్ఛమైన, అచ్చమైన, అలతి అలతి పదాలు, పదబంధాలే. నాగరిక సమాజంలో అనేక ప్రక్రియల్లో పరిణతి సాధించిన యావత్ సారస్వతానికి వౌలిక విజ్ఞానం జానపదులు సృష్టించిన కళారూపాల నుంచి వచ్చిందే. పద్య, గద్య, సాంఘిక నాటక, నాటికలకు మూలం గ్రామీణ సమాజమే.

సాహిత్యం పలెపదాల్లోంచి పుట్టింది. పలుగుపారల శబ్దాల్లోంచి ధ్వనించింది. పదం సృష్టించింది పల్లె. పదాన్ని ఆదరించిందీ పల్లె. శ్రమజీవుల చెమటల్లోంచి పుట్టిన శబ్ద చిత్రం సాహిత్యానికి, కళలకు మూలమైంది. ఏ సమాజంలోనైనా భాషా సాహిత్యాలకు జవసత్వాలిచ్చేవి స్వచ్ఛమైన, అచ్చమైన, అలతి అలతి పదాలు, పదబంధాలే. నాగరిక సమాజంలో అనేక ప్రక్రియల్లో పరిణతి సాధించిన యావత్ సారస్వతానికి వౌలిక విజ్ఞానం జానపదులు సృష్టించిన కళారూపాల నుంచి వచ్చిందే. పద్య, గద్య, సాంఘిక నాటక, నాటికలకు మూలం గ్రామీణ సమాజమే.
తిరుపతి వెంకటకవులు, గబ్బిట వంటి వారి నుంచి నిన్నమొన్నటి ఈలపాటి, పీసపాటి వరకు గ్రామీణ ప్రాంతీయుల ఆధరాభిమానముల వల్లనే ‘స్వర్ణకంకణాధారులు’ కాగలిగారనటంలో అతిశయోక్తికాదు. ఇవాళ భాషా సాహిత్య దినోత్సవాలు జరుపుకుంటున్నాం. పరిషత్తులు, గానసభల్లో సన్మానాలు, శాలువాల సత్కారాలు జరుగుతున్నాయ. పరిపరి విధాలుగా, రూపాలుగా, సిద్ధాంతాలుగా సాహిత్యం పరిఢవిల్లుతోంది. కానీ, ఈ మొత్తం సారస్వతానికి మూలస్థానమైన గ్రామం సాహిత్యానికి, తాను సృష్టించుకున్న కళారూపాలకు రోజు రోజుకూ దూరమవుతోంది.
కళారూపాలకు స్రష్టలు, ద్రష్టలు, ప్రయోక్తలు, భోక్తలు గ్రామీణులే. ఈ కళారూపాలనుంచి పెంపొందినవే నేటి నాగరిక కళలు సాహిత్యరూపాలైన పాట, కథ, విప్లవం, తెగింపు, పోరాటం, గేయం, నాటిక, నాటకం, సినిమాలు వంటివి పుట్టినవే గ్రామీణ ప్రాంతంనుంచి అలసి, సొలసిన జనానికి ఆట, పాట, వినోదం అందించేవి.
ఈ సాహిత్యమయమైన కళారూపాలే సంస్కృత భూయిష్టమైన నాటకాలు గ్రామీణ వాసన సొక్కని సాహితీ పిపాసుల, పండితులకోసమే సృజించబడినవి. కాని కాలక్రమంలో ఇవి సైతం పల్లె ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా ‘‘జానపద’’్భషల్లోకి తమ రూపాలను మార్చుకొన్నాయనడానికి అనేక ఉదాహరణలున్నాయి.
మనిషి మనుగడకోసం పది మందితో కలసి పనిచేయడం నేర్చిన నాటినుంచే కళలు ఆవిర్భవించాయి. ఆ ‘‘కళల’’కు సాహితీ గుబాళింపులను ‘‘మట్టివాసన’’నుంచే అద్దటం ప్రారంభమైనది. గ్రామాలనుంచే కాలక్రమంలో ‘‘పాతకళలు’’ ‘‘కొత్త కలర్‌ను’’ సంతరించుకొన్న పాత రూపురేఖలు అంతరించలేదు అంతరించదు కూడా సంగీతం, నాటకం, ఒగ్గుకథలు, బుర్రకథలు, యక్షగానాలు, భాగోతం, హరికథలు, సుద్దులు, జముకుల, గంగం, వీధి నాటకాలు, తోలుబొమ్మలాట, వాలకాలు ఇలా ఎనె్నన్నో కళారూపాలు గొప్ప దార్శనికత నిండిన సాహిత్యం గ్రామీణులు ముంగిటనుంచే ఆవిష్కరించబడినది.
ఇందుకు కాల, మాన, రాజకీయ, భౌగోళిక, చారిత్రిక, కౌటుంబిక అంశాలు హేతువులయినాయి. గ్రీసు దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇలియడ్, ఒడిస్సీ వంటి గాథలను హోమర్ డాయిలనేవారు ప్రదర్శిస్తుండేవారు. గ్రామీణ ప్రాంత వర్గపోరాటాలకు చిక్కని, చక్కని సాహిత్యపు సొబగులద్ది వీటిని రూపొందించేవారు. రామాయణంలో కూడా కుశలవులనే పేరుగల ‘‘కుశలవుల రామాయణం’’ గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం గానంచేసేవారనే ప్రశక్తి ఉంది.
ఈ గ్రామీణ సాహిత్యంలో ఓ గొప్ప అంశం అంతర్లీనంగా ఉండేది. అది సంఘర్షణ ఇది అనేక విధాలుగా గోచరమయ్యేది. ప్రధానంగా 3రకాలుగా దీనిని వర్గీకరించవచ్చు. 1. ప్రకృతి మనిషికి మధ్య 2. మనుగడ- వస్తు సంచయానికి మధ్య 3. తన జాతి సంవర్ధనంకోసం ఏర్పరచుకొనే సంబంధాల్లో (ఆర్యగణాల నాయకుడైన ఇంద్రునికి, ప్రకృతికిమధ్య వేల సంవత్సరాలపాటు జరిగిన యుద్ధం).
గ్రామీణ సాహిత్యంలో గొప్ప సరదా అయిన వాస్తవ స్థితిగతులకు రూపమైన వాలకాలు గొప్ప వ్యంగ్యాత్మకమైన సాహితీ సృజనను చేసాయి. ఉదాహరణకు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల పల్లె ప్రాంతాల్లో గౌరమ్మ సంబరాల్లో ఈ ప్రక్రియను ఎక్కువగా చూడవచ్చు. హనుమంతుడు లంకాదహనానికి గుర్తుగా ఒకనికి తాటాకుకట్టి గెంతులువేస్తూ జనంమధ్య ఒక ‘అల్లి’ఏర్పరుస్తారు. ఈ సందర్భంలో అమ్మవారి గుణగణాలను కీర్తిస్తూ ఉంటాడు వాడికి తాటాకులు కట్టారనే సామెత ఇక్కడనుంచే వచ్చింది. కొంతమంది దీనిని ‘కమ్మవాలకం’ అంటారు. (కులం పేరుతోకాదు తాటాకులు కట్టటం చేత (కమ్మలు) అని పేరు) ఈ ప్రక్రియలో గొప్ప వ్యంగ్యాత్మకమైన సంభాషణలను, అప్పటికప్పుడు చెబుతారు. అదే విధంగా ‘సుద్దులు’అనేది ఓ గొప్ప సాహితీ కళారూపం యాదవ గణం పశువుల కంచెలకోసం గొప్పగొప్ప యుద్ధాలు చేసారు. వాటిని గ్రంథస్తంచేస్తే ‘‘్భరతమంత’’ అవుతుందని అంటారు. ‘యాదవభారతం ఎద్దుబరువ’ని సామెత అందునుంచే పుట్టినది (కాటమరాజు కథ, అగు మంచికథ అనేది గ్రంథస్తమైనవి.
ఈ సుద్దులకు ఒక ప్రత్యేకమైన, నిర్ణీతమైన ఛందస్సు ఉంది (కూనపదం) కథకుముందు ఉపోద్ఘాతంగా ‘సుద్దు’ఉండేది. అనగా సూక్తి. జానపద ఛందస్సులో ‘‘పదం’’ చాలా ప్రసిద్ధమైనది. అన్నమయ్య, క్షేత్రయ్య, తదితరుల ‘పద’ రచనలో ప్రసిద్ధులు, పదాలలో చాలా రకాలున్నాయి. సాహిత్యం గ్రామీణ ముంగిట్లోంచి ఎన్ని హొయలుపోయిందో! గొల్లసుద్దులన్నీ ‘‘కూనపదాలే’’ గొఱ్ఱెల కాపరులు మందలువేసిన వేళ తెల్లవార్లు వీటిని పాడుతూనే ఉంటారు. ‘‘హరీ హరీ నారాయణ ఆదినారాయణ’’... అని మొదలుపెట్టి చిలువలు పలువలుగా కృష్ణలీలలను కర్ణపేయింగా గానంచేసారు. ‘‘యాదవుడి గోవులను మాధవుడు గాయగ, మాదవుడు మచ్చావతారడైనాడు’’ అనే దశావతార సంకీర్తనం సాగుతుంది. ఈ పదాల వెనుక నిర్దేశమైన ఛందస్సు గొప్ప తార్కికత, వేమన, సుమతీ, శతకాలంలోని (శిష్టసాహిత్య రూపాలు) పూర్వపక్ష సిద్ధాంత సమన్వయాలతో ద్వంద్వత్మాకంగా ఉంటాయి. ‘‘్భమాకలాపం’’వలెనే ‘‘గొల్లకలాపం’’ అనేది కూడా ఓ ప్రక్రియ.
క్రమేణ తమదైన సొంత సంప్రదాయమునుండి భాష, వృత్తి, మతములు మొదలైన వానిలో ఏదో ఒక కారణముగా, సమూహముగా ఏర్పడి నివాసములుండిన జనపదములలో ఉండేవారు, ‘‘జానపదులు’’. జానపదాల వారు సృష్టించుకొన్న సాహిత్యము. ఇది అనంతమైనది.
‘‘ఒక జాతి’’ చరిత్ర సమగ్రముగా తెలుసుకోవాలంటే శిష్ఠ సాహిత్యముకన్నా జానపద సాహిత్యమే ఎక్కువగా తోడ్పడునని’’ డా.బిరుదురాజు రామరాజుగారి మాట ఆచార వ్యవహారములు, విందులు, వేడుకలు, ఆటలు-పాటలు, అనుబంధాలు, సుఖదుఃఖాలు, సంయోగ వియోగములు, సౌందర్య సౌభాగ్యములు, వీరగాథలు, కన్నీటి బాధలు ఈ విధముగా సమస్తమైన జాతీయ జీవితములు తెలుగు జానపద సాహిత్యంగా పల్లెల ముంగిట్లోనుంచి బయలుదేరింది. వీటన్నింటిని రికార్డుచేసినది సి.పి.బ్రౌన్ జె.ఎ.బోయిల్ అనే ఆంగ్లేయులంటేనే గుండె కలుక్కుమంటుంది.
ఇవన్నీ కథలు, సామెతలు పొడుపుకథలుగా తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పొందాయి, పొందుతున్నాయి. పురాణ కథలు, ఇతిహాసములు, జానపద కథలుగా వర్గీకరించబడినాయి. స్థలము, వ్యక్తి, సంఘటనలకు సంబంధించిన కథలు, సామెతల కథలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత సాహిత్యం ఇక్కడనుంచే సృజించబడినది. ఇవికాక ‘‘యక్షగానములు’’ గొప్ప ప్రక్రియలుగా ఖ్యాతినొందినవి క్రీడాభిరామమున జక్కుల పురంది విప్రనారాయణ చరిత్ర (1545) సుగ్రీవ విజయం (1568)వంటి 17వ శతాబ్దమున యక్షగానములలోపాటు కన్నడ దేశమునుంచి కూడా కొన్ని తంజావూరు ప్రాంతమునుండి (స్వర్ణయుగకాలం) కొన్ని తెలుగునాటకు దిగుబడి అయినవి. దాదాపు 500 యక్షగానములు ముద్రితములు ఇంకా మరో 50 మూలబడి ఉన్నవి. ఈ సంపదను గ్రామీణ సాహితీసొత్తుగా నేడైనను భద్రపరిచే బాధ్యత ప్రభుత్వాలు, సంస్థలు తీసుకుంటే బాగుంటుంది.
వర్తమానంలో.. కేంద్ర సాహిత్య అకాడమీ ఇటువంటి బృహత్తర ప్రయత్నానికి నడుం బిగించడం సాహసోపేతమైన క్రియ. ప్రస్తుతం అనేక ప్రచార సాధనాల వలన పెరుగుతున్న వేగవంతమైన అధునాతన సాంకేతిక ప్రక్రియల చేత సాహిత్యం గ్రామీణం నుంచి క్రమంగా దూరమవుతున్నది.
సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన సాహిత్యం భావి గ్రామీణతరానికి తెలియజేసి వారిని ఈ మహాయజ్ఞంలో చేయూతనిచ్చేవారికి, సంధానకర్తలుగా మార్చుకోవలసిన తరుణమిదే. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి జిల్లాలోను ఏర్పాటుచేయవలసిన ఆవశ్యకత ఉంది.

- భమిడిపాటి గౌరీశంకర్, 9492858395