సాహితి

దుఃఖం కోస్తున్న వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడిస్తే బాధ దిగిపోదు
ఏడవకుంటే బాధ పెరిగిపోదు

ఏడిస్తే బాధ తీరితే
అందరూ ఏడ్చేవారు
అపుడు
ఏడుపు నేర్పించే పాఠశాలలొచ్చేవి

సమస్య వస్తే
దుఃఖించడం బలహీనత
చిన్న చిన్న చిక్కులకే
పొగిలి పొగిలి దుఃఖించడం హీనత!

ఏడుపు బతుక్కు సహజం
చిన్న చీమకైనా దుఃఖముంటది
కీటకానికైనా చెరలుంటవి
మనలా అవి ఏడవ్వు
రెక్క విరిగినా జీవిస్తవి
కాలు తెగినా నిబ్బరంగ నిలబడతవి

మనమే
మన మనుషులమే
తలనెప్పికే తల్లడిల్లిపోతాం
మోసపోతే చితికిపోతుంటాం
మనం ఏడ్చే దుఃఖాలు అనంతం
అంతా బాగుండీ
ఏ దుఃఖమూ లేదంటే
బాగున్నవాళ్లను చూసి ఏడుస్తుంటాం!
మనకు నవ్వడం తెలీదు
నవ్వువల్ల ఆరోగ్యం తెలీదు
నవ్వుల ఔచిత్యమూ తెలీదు
అప్పుడప్పుడూ
డొల్లనవ్వులను తప్పిస్తే
విషపు నవ్వుల్ని తీసేస్తే
నవ్వు నటనల్ని పరిహరిస్తే
మనిషి
ఏడుపుతోనే పుట్టాడు
ఏడుస్తూనే సాగిపోతాడు
ఏడుపే మిగిల్చి కాలం చేస్తాడు!
అసలు
మనిషంటేనే ఏడుపు!
నాకు మాత్రం
దుఃఖం గుండెను పిండేస్తున్నా
నిలకడగా నిలబడే మనిషిబొమ్మ గీయాలనుంది!
దుఃఖం గుండెను కోస్తున్న వేళ
నిశ్చల సమాధిలో ధ్యానించే
చేతన రాయాలనుంది!
నాకు మాత్రం
ఏడుస్తోన్న ప్రతి మనిషి ముఖంలో
మచ్చలేని చిరునవ్వుల చిందుల్ని
చూడాలనుంది!

- మెట్టా నాగేశ్వరరావు