సాహితి
నిర్ణయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 January 2016
- అరుణ నారదభట్ల
అనుకోకుండానే కొన్ని
ఆఖరు క్షణాల్లో చిక్కిపోతుంటాం
మనసుకూ జీవితానికి మధ్యన
తెగని దారం ఒకటి
రెండు చివర్లను కలుపుతుంది
తెగకుండా దగ్గరవకుండా
నిర్ణయానికి భవిష్యత్తుకు పొంతనా ఉండదు
అడుగు వెనకేస్తే ముందు ఆగిపోతుంది
ఒక్క క్షణమే కాలానికీ గమనానికీ ముడివేసేది
నడి వేసవిలో చినుకు రాలినప్పుడు
మట్టి గుబాళింపు కమ్మదనమే
నీళ్ళాడిన చెట్లకు చిగుర్లు మొలిచినట్టు
ఆశ కొత్తగానే ఉంటుందెప్పుడూ!
ఆకాశం నల్లదే
ఏ సూర్యుడో చంద్రుడో
చివరికి నక్షత్రాలో
క్షణంలో తళుకుమనే మెరుపొకటో
ఆసరాగా నడిచినప్పుడే
వజ్రమంటే కాంతియో మల్లెలంత తెలుపొ
పసుపుపంటగానో పత్తిపంటగానో
నీలి మేఘమాలగా
చల్లని కవన ప్రకృతిలా సాగిపోతుంది
ఆ ఒక్క క్షణమే
గతి మార్చే జీవితానికి
మార్గమయ్యేది అగాథమయ్యేది!