సాహితి

తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టాలకు వ్రేలాడే రైలు బండి లాంటి
అతను
పొగకక్కడమే జీవితమనుకొంటాడు
చివరికి మిగిలేదేముందని
ఎవరు ఎంత ప్రశ్నిస్తే ఏమిటి
తాను కూడా ఒక అవశేష దుఃఖమని
ఎంతకూ అర్థం చేసుకోలేడు
తాను బతుకగా మిగిలిన
ఏ కొంచెం గాలో అది
దాన్నైనా శుభ్రంగా పిలుస్తాడా అంటే
అబ్బే అసలు ఇష్టపడడు
అగాథ వ్యాకరణం
సరళీకరణం చెందినపుడు
ఒక రసోన్మాదంవల్ల
తనకు వచ్చిన ఈ ప్రపంచాన్ని
ఒక నిమిత్త చర్యగానే అర్థంచేసుకొన్నాడు
పాపం......
విజయోత్సవం కూడా
అనాగరిక యుద్ధం సంకేతమేనని
అతడెపుడు గుర్తిస్తాడో
వెలసిన దీర్ఘనిద్రలో
నిన్నటి దాకా
నడుమున
నెలవంక లాంటి
కొడవలితో
నడినెత్తిన చంద్రబింబాన్ని మోస్తూ
పాలుపోసుకున్న జొన్నకంకిలా నవ్వుతూ
పాలపిట్టలకు
పరువపు గీతాలను నేర్పించి
పైరగాలులతో
పరవశించి పాడిన
పల్లెపడుచు
నేడు
జీవంలేని కళ్ళతో
పాలిపోయిన దేహంతో
దూడ దూరమైన తల్లి ఆవులా
దిగులు వదనంతో
సడలిన సత్తువతో
ముడుతల దేహంతో
పట్నం వలసపోయిన ప్రేమలు
గుండె గూటికి మరలి వస్తాయని
గువ్వపిట్టలా నిరీక్షిస్తూ
దుఃఖరాగం ఆలపిస్తుంది.

- గరికపాటి మణీధర్ 9948326270