సాహితి

మనిషితనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రుడా...
నాకింకా ఈ మనుషుల మీద
బంధాల మీద
నమ్మకం సడలలేదు
నన్నిక్కడే వుండనివ్వు

ఈ పల్లెల మీద, పిలుపుల మీద,
వరుసల మీద
నాకింకా మమకారం తీరలేదు
నన్నిలా వదిలిపెట్టు -

ఇక్కడి చల్లగాలి లేత స్పర్శలో
ఏదో తెలియని
ఆత్మీయత పొడమి వుంది
తనివితీరా గ్రోలనివ్వు -

ఈ త్రోవలనిండా స్నేహపు పరిమళాలున్నాయ
అనురాగపు ఛాయలున్నాయ
అనుబంధపు పందిళ్ళున్నాయ
కాసేపు నన్నిలా నడువనివ్వు -

ఈ పచ్చిక నిండా
ప్రేమ సురభిళిస్తోంది
ఈ తోటనిండా ఏవో మధుర జ్ఞాపకాలు
గుబాళిస్తున్నాయ
ఇక్కడి మనుషుల మధ్య నన్ను నేను
తన్మయస్తున్నాను
వీరిమధ్య ఈ శ్వాసకు కొత్త ఊపిరేదో
అందుతున్నట్లు హాయగా వుంది
నన్నిలా వదిలిపెట్టు -

ఏ రాగమూ లేకుండా జీవించడం
నా వల్లకాదు
నేనింకా మానుషత్వం వీడలేదు
సమూహం కోసం
నన్ను నేను కోల్పోవడంలో
ఏదో ఆనందం వుంది
ఈ ఎరుక హాయగా వుంది
ఏమీ లేని తనం కన్నా
ఏదో ఉన్నతనం వెచ్చగా ఉంది
నన్నిలా వుండనివ్వు -

వీలైతే నువ్వూ ఇక్కడే వుండిపో -
మనిషితనం ఏమిటో తెలుసుకుంటావు
నువ్వూ మనిషివవుతావు.

- సూరారం శంకర్ 9948963141