సాహితి

సమకాలికులలో ఆధునికుడు అంపశయ్య నవీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు సాహిత్యంలో అంపశయ్య నవీన్ ఒక విలక్షణమైన కాల్పనిక వచన రచయిత. విలక్షణత వారి మొట్టమొదటి నవల ‘అంపశయ్య’ మొదలు, ముప్ఫై రెండవ నవల ‘ప్రేమకు ఆవలి తీరం’ దాకా మళ్ళీ మల్ళీ రుజువవుతూనే వుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని విద్యార్థుల సామూహిక జీవితాన్ని, రవి అనే విద్యార్థి వైయక్తిక జీవితంతో సమన్వయం చేసి రాసిన విలక్షణ నవల అంపశయ్య (1969) ఈ నవలలోని చైతన్య స్రవంతి శిల్పం వారిక సహజంగా అలవడింది. ఆ తర్వాతనే ‘జేమ్స్ జాయిస్’ ‘ములిసెన్’ నవలను ఆ టెక్నిక్‌తో రాశాడని వారికి తెలిసింది. వెయ్యేండ్ల కాలంలో గొప్ప రచనలుగా గుర్తింపు పొందిన వాటిలో ‘అంపశయ్య’ ఒకటి! ‘అంపశయ్య’కు కొనసాగింపుగా ‘ముళ్ళపొదలు’, ‘అంతస్స్రవంతి’ నవలలు రావటంతో వీటిని నవలాత్రయంగా విమర్శకులు గుర్తించారు. అట్లాగే తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా వచ్చిన ‘కాలరేఖలు’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు (2004) లభించింది. దీనికి కొనసాగింపుగా ‘చెదిరిన స్వప్నాలు’, బాంధవ్యాలు నవలలు రచించటం జరిగింది. దీంతో రెండు నవలాత్రయాలను రచించిన ఏకైక నవలా రచయితగా నవీన్ సాహిత్య రంగంలో స్థానం సంపాదించారు. తన ఆత్మీయ మిత్రుడు ఎం.వి.తిరుపతయ్య ఎమర్జెన్సీ రోజుల్లో అప్పటి వ్యవస్థ చేతిలో అనుభవించిన మానసికమైన రంపపుకోత ఆధారంగా ‘చీకటి రోజులు’ నవలను రచించారు నవీన్. ఇదే ఒక సాహసం అనుకుంటే, దశాబ్దాలుగా నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో బలవుతున్న అమాయకుల సమస్యలను, ఈ రెండు వర్గాలను గూర్చి ప్రజలు చిర్చంచుకుంటున్న అంశాలను ‘రక్తకాసారం’ నవలలో అరమరికలు లేకుండా చిత్రించటం మరో సాహసం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాసిన ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ నవలలో సామాన్యునికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల చిత్రణ కనిపిస్తుంది. మొత్తం ఈ 32 నవలలు జీవితం సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు. నవీన్ దాదాపు నూరు కథానికలు రచించారు. ఇవన్నీ ఏడు సంకలనాలుగా వెలువడ్డాయి. వాస్తవికత, కాల్పినికత, మనో వైజ్ఞానికత ముప్పేటలుగా అల్లుకున్న కథానికలివి. సాహిత్య విమర్శకుడిగా కూడా నవీన్‌కు మంచి పేరుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన దాదాపు అన్ని ముఖ్యమైన రచనల మీదా నవీన్ స్పందించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ తొలి తెలంగాణ నవల అని నవీన్ నిశ్చితాభిప్రాయం. ఈ నవల ప్రభావంతోనే దాశరథి రంగాచార్య తెలంగాణ జీవితాన్ని చిత్రిస్తూ నవలలు రాసిన సంగతి వారు అనేక సందర్భాలలో గుర్తుచేస్తూ వచ్చారు.
ఆధునిక సినిమా రంగం మీద నవీన్‌కు ఆసక్తితోపాటు, గొప్ప సినిమాలలోని కళను అధ్యయనం చేయాలన్న శ్రద్ధ కూడా వుంది. కరీంనగర్‌లో సినిమా క్లబ్‌ను స్థాపించి, జాతీయ అంతర్జాతీయ సినిమాలను సామాన్య ప్రేక్షకుల అందుబాటులోకి తెచ్చారు. వారి మీద సత్యజిత్‌రే సినిమాల ప్రభావం వుంది. నందీ అవార్డ్స్ జ్యూరీలో వారు సభ్యులుగా వున్నారు. అయితే వీరి అంపశయ్య నవలను ప్రభాకర్ జైనీ చలనచత్రంగా నిర్మించిన 2016లో విడుదల చేయటం తెలంగాణ నవలా రచయితకు లభించిన అరుదైన గౌరవంగా భావించవచ్చు.

- అమ్మంగి వేణుగోపాల్, 9441054637