సాహితి

పూర్వవాసనల విరిజంపు ఆమని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంబున నినె్చ ఘల్ఘలలు నృత్యన్మంజుమంజీర శిం
జా కల్యాణ పరంపరాశ్రుతులు ఋక్సామోజ్వల ద్ఘోషలున్
రాకా చంద్ర కలా తరంగ తతి చర్చాసాంద్రతల్ నూత్న వి
శ్వాకారంబు సహస్ర పత్రకమల స్పందద్వికాసంబులై

దళమై దీర్ఘమునై ప్రసాదమయమై తారళ్యభానంబునై
నెల వంకల్ వికసించు వెనె్నలల వనె్నల్ విప్పుకొన్నట్టులై
కుల సౌందర్య పరాగ పుంజములు దిక్కుల్ పూచినట్లై సుమో
జ్వల వౌ నాద మొకండు దొరగతి పంచారించె ఋత్యర్థమున్

చైత్రమాసోర్మి పరిమళ సింధువగుచు
వృత్తి సంకల్ప రూప సంవిత్తి పొల్చి
రాగ మాయా కలా రామరక్తి యగుచు
సితమహాలాస్యమభినయ శివమెసంగె

ఎలమావి గుబురులో కలకలక పచరించు
నీలిమేఘ ముకుళ కాలగీతి
మాగుతేనెలు త్రావి మత్తులో తెగతూలు
తుమ్మెద పాదాల తొట్రుపాటు
కొస కొమ్మ వసియించి గుసగుసల్ వోయెడి
చిలుక పలుకులోని చెణుకు చొప్పు
తలిరు విల్తుని మామ చలువ వనె్నలలోన
చిగురించు నులివెచ్చ చిలిపిదనము

తలుపు తట్టిన చప్పుడై ఉలికిపడితి
గడియ తీసితి నెవ్వరు కానరారు
ప్రాంగణమున మందారము పక్కుమనెను
కెంబెదవి విచ్చి నోరార గేలిచేసె...

వెలుగు పుంతల తూర్పు వెచ్చని యాశలు
నెగడిన కాకనే నిశ్వసించి
జీర్ణమారుతమూర్తి శీర్ణశాఖల మీద
క్రొత్త మొగ్గల దారి కొసల బ్రాకి
సంజవేళకు మునె్న చల్లని గాలిలో
సన్నగిల్లిన శైత్వ సరణి జూపి
పువు ముల్కి దొరగాం సవనాగ్ని తాపాన
సిగ్గుతో ఎదనంటు చిబుకమెత్తి
అరుణ రాగావ కుంఠనాంతరము వీడి
మృదుల పవమాన పరిచమోర్మికల తోడ
సృష్టి తొలి సంజ విచ్చుపూరేకు యట్లు
వచ్చినది భూరి వాసంతి కచ్చుగట్టి...
చిదిమి పెట్టిన దీప శిల్పమ్ము నొలయించు
మందార కన్యదౌ మధుర క్లస్తి
సిగ్గు పూతల దేవి చిరునవ్వు లొలికించు
విరజాజి విరిచేడి విరహరేఖ
మెలపారు సొగసుతో నెలకువల్ పచరించు
చేమంతి పసిగాపు చెలిమి జోక
చిక్కని చిగురాకు జేబులో కదలాడు
నవమల్లికాభ్యస్త నాట్యసరణి

ప్రాగుదిశ చంద్రబింబముపైన తరక
కట్టినటులున్న క్రొత్త మేఘంఫు తునక
సరస వాసంత సుభగము సవదరించి
‘హేమలంబి’కి ఆశల ఏతమెత్తె...
పొదపైని విరితావి కదలాడువైనాన
పులకరింతల కొక్క ప్రొద్దులేదు
జడతకే గిలిగింత నడరించు కోయిల
పడుచు పాటకు తీఱుబాటులేదు
పూదేనె తెగత్రావి మ్రోయు తుమ్మెద ఱేని
పానగోష్టికి వేళ పాళ లేదు
విరుల చెక్కిలి మీటు చిరుగాలి పిలగాని
మిడిసిపాటున కాట విడుపు లేదు

తత్త్వమనుభూతి నిష్యంద తరుణమందు
జీవ ప్రాభాత సంయోగ సిద్ధి వడసి
తరళకాంతులు సివమెత్తి శాంతనించ
చివురు జోతల నర్పించె చిన్ని మొక్క...

అర్కమేఘముల దయకు నందబోని
కటిక నిఱుపేద గుడిసెల కనికరించి
గగన మార్గాన పదియాఱు కళలతోడ
జనుచునున్నాడు ననకారు చందమామ...

- సాంధ్యశ్రీ, 8106897404