సాహితి

వెంటాడే జ్ఞాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు ఊరంతా ఒడికట్టుకొని
ఒక్కొక్కటిగా ముడివిప్పి
తినిపించే మా నాయినమ్మకు
నేనంటే మాగావురం

తల్లికోడై ఒడుపుగా తిప్పుతూ
ఆచితూచి అడుగేయడం నేర్పేది
సంక దించకుండానే చాలా పనులు చక్కదిద్దేది
నావల్ల నష్టం జరిగినా యిష్టపడేది కాదు
నాయిన, అవ్వకొట్టినపుడు
నాకు రక్షణ వలయమై నిలిచేది

నేనైనా నాతో ఎవరైనా తగవులాడినా
తమది తప్పుకాదనీ
తప్పంతా ఎదుటొల్లదేనని విప్పిచెప్పేది
జ్వరం బాధించే నన్ను చూసి
కన్నుమూయక, నన్ను వదలక
నాటు వైద్యంతో బాగుచేసేది
దండం పెట్టి ‘‘మీదే దీపం పంతులూ!
నా మనువడికి మంచి సదువు చెప్పు’’మని బతిలాడుతూ
సలాం చెసి సాగిలపడేది
పోతూపోతూ బిస్కొటో, చెక్కరిగోలో ఇచ్చిపోయేది
బతికిపోతున్న నన్ను చూసి
బంగారమని మురిసి తల నిమురుతూ
తన కంతలకద్దుకుని ముద్దడేది

రాతిరి మేలుకువున్నంతసేపు
మేలుకొలుపు కథలు శాత్రాలతో
తన గాత్రం వినిపించేది
వయసు పిలగానివి
ఆర్సి కండెడు తినాలే, ఓర్సి పనిచెయ్యాలని
వద్దనంగా వడ్డించి
తినేదాక వదిలేది కాదు
తిన్న నన్ను చూసి తురితి పడేది

తన మని ఉండంగా పెండ్లిచెయ్యిమని
మానాయిన తోటి పంచాది పెట్టేది
సదువు సదువు అని ఎన్నొద్దులు తిరుగుతవు
కొలువు కొలువు అని ఎన్నొద్దులు వాయిదేస్తవు
నా కండ్ల ముందట లగ్గం చేసుకొమ్మని
నాతోటి కొలువు పెట్టేది
ఆపాయే బిడ్డా!
ఒక్కనివైనందుకు నలుగురిని కనుమని పురికొలిపేది
శాతనై శాతగాకున్న
తన ఆలోచనలన్నీ నా చుట్టే తిప్పేది

ఎపుడైనా తలగమిట్ల కూసుండు
ఎంత పాపం చేసింది
ఇపుడు దర్వాజ మీది చిత్రపటమై
నిర్దయగా నవ్వుతోంది
తన జ్ఞాపకాలు ముద్రించి
వెంటాడే జ్ఞాపకమై వెళ్లిపోయింది
*

- సిద్దెంకి యాదగిరి, 9441244773