సాహితి

ఊరు ఒక నారుమడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరు మన తల్లివేరు
కాదనను, నిజమే కాని
ఊరు ఒక్క తీరుగా తీరు చెప్పమని
పోరు పెడుతుంది

ఇప్పుడు
ఊరు గురించి రాయడం
చెట్టులేని చోట
కోకిలలా కూయడం

పట్నం ఒక నిమాయష్
ఇది అరొక్కటిని అమ్ముతుంది
అందరినీ కమ్ముతుంది
ఊరు బతికి చెడ్డది
మనసు నానుమాల పడ్డది

నా నిలువెల్లా చూడు
మా ఊరే కనిపిస్తుంది
నా అణువణువును తాకు
మన భాష వినిపిస్తుంది

తారు రోడ్డు వచ్చింది
ఊరు తెలియని ఆగంల పడ్డది
టి.వి. సెల్ చేరింది
ఊరు తగ్గని రోగంల చెడ్డది

పొద్దిచ్చిన బొడ్రాయ ఆవుసు గట్టిది
వడగాడ్పుల సుడిగుండాలు
గాలి వానల వరద గండాలు
అపాయాల్ని తట్టుకొని నిలబడింది
ఎన్ని తిప్పలు పెట్టినా
గొప్పగా బలపడింది
వాడలు ఏకమైతే ఊరు
సబ్బండ కులాల వర్ణమాల
ఊరవతల ఇంకా అంటరాని బేజారు

పని కోసం
గ్రామం సంగ్రామం చేస్తుంది
పట్టణాల్లో లేబర్ అడ్డా మీద
కూలి కోసం గోసగోసోలె చూస్తుంది

విరుగుతున్న హలం
ఎండుతున్న పొలం
కరువు బతుకును
ఊరు బరువుగా మోస్తుంది

అయతే చావు
కాదంటే వలసల రేవు

దూపతో ఊరు పెదవులు
ఎండిపోతున్నయ్
చెర్ల నీళ్లు చెరువు వెనుక పడ్డయ్
ఒక ఆశ ఒక ధ్యాస
ఊరును జీవితో నిలుపుతున్నయ్

ఊరు ఒక నారుమడి
తను బలహీనపడ్డా
వేరేచోట మొక్క బలంగా ఉండాలనే
కన్నతల్లి ప్రేమ దానిది

గ్రామం నా నామం!
ఊరు నా చిరునామా!!
కన్నీరే నా వీలునామా!!!

- జూకంటి జగన్నాథం, 9441078095