సాహితి

శివానంద రామాయణంలో రసవిభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివానంద రామాయణం (బాలకాండ)
రచన: ఆచార్య వి.యల్.యస్.్భమశంకరం
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారి ప్రచురణ:
పేజీలు: 484; వెల: రు.150/-
ప్రాప్తి స్థానం:
తి.తి.దేవస్థానం వారి అన్ని విక్రయశాలలలో...

యావత్ స్థాస్యంతి గిరయ స్సరితశ్చ మహీతలే
తావద్రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి-36
- అని వాల్మీకి మహర్షిమాట. రామకథా రచన గిరులు, నదులు భూమిమీద ఉన్నంతకాలం సాగుతూనే ఉంటుంది. తమదైన అనుభూతి తమదిగా రామకథా సాక్షాత్కారాన్ని పొంది అక్షరబద్ధం చేస్తూ ఉన్నారు ఎందరో తెలుగు కవులు.
కొత్తగా వెలువడిన శివానంద రామాయణం (బాలకాండ) కర్త ఆచార్య వి.యల్.యస్.్భమశంకరంగారు. ఈయన రసస్రువు, శివానంద మందహాసం, భీమేశ్వరోదాహరణం, ఓరామ! నీ నామమేమి రుచిరా! వంటి కావ్యాలు వ్రాసి, ఆంధ్ర సాహిత్యాన్ని సంపన్నం చేసారు.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ రామాయణంలో భాగాలకు ఖండాలు అని పేరు పెట్టారు. భీమశంకరంగారు కూడా ఆ పద్ధతినే అనుసరించారు. బాలకాండలోని కథను వీరు పదహారు ఖండాలుగా విభజించి రచించారు. షోడశ కళాప్రపూర్ణుడయిన శ్రీరాముని రమణీయగాథను షోడశ ఖండాలుగా రచించడంతో ఔచితీమండితమైంది.
‘మధుర శబ్ద్భావార్ధ సమన్వితము, వర్ణనాత్మకముపమాన వాఙ్మయంబు అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని - ‘లలితాహ్లాద మహేతిహాసంగా వ్రాయాలని ఈ కవి సంకల్పం. ఈ రామగాథను ‘వేడుకమామిడి మెసపుచు, పాడెడు పుంస్కోకిలట్లు పాడాలని’ వీరి ఆఖాంక్ష.
అయోధ్యాపుర వర్ణనతో కథఆరంభమైంది. ఆ నగరంలోని ఉపాధ్యాయులు, ‘సమీచీనశోధన సంకల్పత దేశ సంస్కృతికి ఉత్సాహంబు చేకూర్చుతారట. భీమశంకరంగారు కొన్ని సందర్భాల్లో వాల్మీకికి భిన్నంగా రచన చేసారు.
సీతావిర్భావ ఖండం విపులంగా సాగింది. భూదేవి స్వయంగా బాలికామణిని జనకమహారాజుకు- ‘నా రుక్షినిందను కన్‌దాగిన ఈ మనోజ్ఞశిశుమన్ దైవాంశ సంభూత సద్గుణ వారాశి నీకు పుత్రికగనిత్తు గైకొమ్ము సంప్రీతితో’’ - అంటుంది యజ్ఞార్థమై భూమిని దునే్న సందర్భంలో
జనకుని భార్య సుమేధ సీతను తెలుగింటికనె్న పిల్లగా పెంచుతుంది. కనె్న తులసి నోము నోయించింది అని కవిగారి ప్రత్యేక వర్ణన.
వాల్మీకి రామాయణంలో సీతాకాంతను చేపట్టడానికి శివుని విల్లు ఎక్కుపెట్టాలనే నియమం ఉంది. అయితే ఈ రామాయణంలో అరుంధతీదేవి- సీత శివధనుస్సును ఆటల్లో అవలీలగా ఎత్తడం గమనిస్తుంది. జనక మహారాజుతో రహస్యంగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన వీరునికే సీతను ఇచ్చి వివాహం చేయి. ఆమె కారణం దుష్టశిక్షణ శిష్ట రక్షణ జరుగనున్నది అని భావి కథను సూచిస్తుంది.
రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు మార్గమధ్యంలో చెప్పిన వామనావతార కథ కవిగారు ఖండకావ్యపు పరువంతో కూర్చారు. పోతన భాగవతంలోని కథా పద్ధతిని అనుసరిస్తూనే తమదైన శిల్పచాతురిని ప్రదర్శించారు. నువ్వు ఎవరు అని అడిగిన బలిచక్రవర్తికి వామనుడిచ్చిన సమాధానం- వ్యంగ్య వాసనా విలసితంగా ఉంది.
‘ఎవరు చెప్పినను తెలియదెవరొనేను
తెలియనట్టిది విన్నంత ఫలము గలదె
ఎవరికిని వారెనాతత్త్వ మెరుగ వలయు
ఎరిగినంతనె సర్వంబు నెఱిగినట్లె.
యజ్ఞ పరిరక్షణ సాహసోపేతులై, శ్రద్ధాళువురై చేసిన రామలక్ష్మణులపై దేవతలు విరులు కురిపించారు. విశ్వామిత్రుడు రాముణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని మురిసిపోయాడు. ఆ సన్నివేశంలో శ్రీరాముడు అతి నమ్రుడై
కం. మాయవధానమేరకు
మీ యజనము కాచితిమి సమిద్ధశ్రద్ధన్
మీ యాశ యంబు మేరకు
మీ యజనము విజయమాయె, మేలయెధరకున్ - 1076
అంటూ గురుసేవలో జన్మచరితార్థమైందని ఆనందిస్తాడు.
వామనుని కథలాగే- అహల్యావృత్తాంతాన్ని ప్రత్యేకంగా నూట అరవై పద్యాల్లో సవివరంగా వర్ణించారు కవిగారు. శ్రీరాముడు పతిత పావనుడని లోకానికి తెలియపరచేగాథ అహల్యగాథ.
భీమశంకరంగారి రచనలో అహల్య సర్వాంగ సుందరి మాత్రమే కాదు. చిత్రకారిణి కూడా. గౌతముని మనసెరిగి మసలుకొనే మంచి ఇల్లాలు. అయితే గౌతముని వేషంలో వచ్చి ఇంద్రుడామెను వంచించాడు. కోపించిన గౌతముడామెను శపించాడు. వాల్మీకి రామాయణంలో- అహల్యా గౌతముల పుత్రుడు శతానందుడు ఆ సందర్భంలో కల్పించుకున్నట్లు లేదు. కానీ ఈ రామాయణంలో శతానందుడు- తండ్రితో తల్లిని గురించి చెప్తాడు. అమ్మ మాటలు నమ్మి ఆమెను పునీతను చెయ్యండని అర్ధించడం నూత్న మర్యాదలంకృతమై ఉంది.
అయితే గౌతముడు తన పుత్రునకు ఇచ్చిన సమాధానం-
ఇట్టి ఘాతమున శిక్షించకుండ
యూరకున్నను పూర్వంబు నుండి నేటి
వరకు నొడుదుడుకులు లేక బరగుచున్న
మన వివాహ వ్యవస్థ ప్రమాదమొంది
మలినపడుచు న్యస్తవ్యస్తమై నశించు - అంటారు గౌతముని గొంతులో గొంతు కలిపిన కవిగారు. భారతీయ వివాహ వ్యవస్థా పరిరక్షణ కొరకే అని స్పష్టం చేసారు. అహల్య రామునికి భక్తితో నమస్కరించి తనకీ శిలారూపం న్యాయసమ్మతమా అని ప్రశ్నిస్తుంది. శ్రీరాముడు సోపపత్తికంగా సమాధానం చెప్పి, ఆమె చేతి విందారగించి ఆమెను ఆశీర్వదించిన ఘట్టం మహనీయంగా వ్రాసారు. స్ర్తిగా తనకు జరిగిన అన్యాయాన్ని రామునితో విన్నవించే పట్టున తిక్కని గారి ద్రౌపది ధోరణిని అందుకుని
చం. నలువకు పుట్టితిన్ జగతినన్ను వనొందెడు నందచందముల్
కలిగి యహల్య పేరుగొని, గౌతముడన్ మునినాధు భార్యనై
యలఘ విధిజ్ఞులైన నిగమాగమ వేద్యుల కంటి పుత్రులన్
పలికెడిదేమి యన్నిటను ప్రజ్ఞగలట్టి సతీమణిన్ ప్రభూ- 1262
తన మీది అపవాదును పోగొట్టి తనకు పూర్వ గౌరవాన్ని కలగచేయమని అహల్య వేదనాభరిత హృదయంతో శ్రీరాముని కోరుకున్న- పద్యం-
తే.గీ. ధాతయు మునియు నింద్రుండు ధరజనులు
ద్రోహము చేసినారలీ తొయ్యలికిని
నాయెడ నపవాదము లాపి నన్ను పూర్వ
వృత్తినిష్కలంకను చేయుమీ మహాత్మ!- 1270
అహల్య గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చిన ఆవేదన ఇది.
మిథిలా నగర వైభవాన్ని దర్శించబోయిన రామలక్ష్మణులకు ప్రమదావనంలో దుర్గను పూజించడానికి వచ్చిన సీతాదర్శనం లభిస్తుంది. సీతారాములిద్దరూ భావోద్దీప్తిని పొందారు. శ్రీరాముని మానసం
తే.గీ. ఎన్మొజన్మల బంధమ్ములిమిడినట్లు
ఎన్నొ యుగముల సావాస మెలమినట్లు
ఎన్నొ కల్పాల సాఫల్యమెలసినట్లు
తోచెనాకీమెభావం బుగోచరింప- 1157
సీత సౌందర్య వర్ణనలో ఆమెనడుము ‘తెలుగు లిపి నుండి ‘ళ’ నడిమి తెచ్చి చేసారని వర్ణిస్తారు వినూత్నంగా. వివాహానికి ముందు సీతాసౌందర్యాన్ని చూసి రమ్మని లక్ష్మన్నను పంపినట్లు జానపద రామాయణ గేయాల్లో ఉంది. ఆ భావనను గ్రహించి భీమశంకరంగారు తమ రామాయణంలో చేర్చారు. సీతాదేవిని చూచి వచ్చిన లక్ష్మన్న వాక్కు సంస్కార సంపన్నమైనది.
మగువ చూడంగ నా మది మాతృమూర్తి
యన్నభావంబు కలిగె మా యమ్మ స
మిత్ర కనులందు గల ప్రేమ మెండుగాను
ఈమెలో కానబడియె నాకినకులేశ.! అంటాడు.
వాల్మీకి రామాయణంలో సుమిత్ర ‘మాంవిద్ధి జనకాత్మజమ్’ అని అయోధ్యకాండలో చెప్పిన సూత్రం లక్ష్మన్న బాలకాండలోనే భావించాడు.
బాలకాండలో శివధనుర్భంగ ఘట్టం విశేషమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని పలువురు రామాయణ కర్తల వారి వారి భావాంబరవీధిలో దర్శించిన విధానాన్ని లేఖ్యారూఢం చేసారు. శివధనుస్సు నుండి వెలువడిన శబ్దాన్ని పలు రకాలుగా భావించారు. విజ్ఞానశాస్తవ్రేత్తలు భీమశంకరంగారు దర్శించిన తీరు శాస్తబ్రద్ధంగా సాగింది.
శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టబోతున్నాడు- భూమిని జాగ్రత్తగా పట్టుకోమని, ఆది కూర్మాన్ని, వరాహాన్ని, శేషుణ్ణి, దిక్కుల్ని హెచ్చరించాడు లక్ష్మణుడు- అని మొల్ల రామాయణంలో చక్కని పద్యం వ్రాసింది. ఇది పౌరాణిక కథా ప్రతిపత్తిగల విషయం. భీమశంకరంగారి లక్ష్మణుడు వైజ్ఞానిక శాస్త్ర దృక్పథంతో- ఓ పృథ్వీ నువ్వు- ‘సరియగు కక్ష్యను వదలక,
తిరుగుమునీ చుట్టు నీవు తీరుగ మింటన్’ అంటాడు
సూర్యునితో - ‘ఎక్కుపెట్టగను ప్రబ్బెడు శబ్దతరంగ ధాటికిన్
ఈ శివానంద రామాయణంలో సీతారామ కళ్యాణ ఖండం తెలుగింటి పెండ్లిగా జరిగింది.
సీతాదేవిని సర్వాభరణ భూషితురాలుగా అలంకరించారు. అంతేకాదు ఆ పెళ్లి కూతురు అరచేతులకు కోకనదవర్ణంపు గోరంట కూడా చిత్రించారు శ్రద్ధగా. స్వయంవరంలో వీర్యశుల్కం కోరే వంశాల్లో- వధువు సుమమాల తెచ్చి వరుని గళంలో వేయడాన్ని ప్రత్నసంప్రదాయమంటారు. వరమాల వేయడానికి వచ్చే సీతను సిగ్గు వెనక్కి కోరిక ముందుకి లాగడంతో ఆమె ‘అడుగిడు నడుగిడదటు పడుచు’ అంటారు. పోతనగారి గజేంద్రమోక్షంలోని లక్ష్మీదేవిని గుర్తుచేస్తూ.
కల్యాణ సన్నాహాలు ఆరంభమయ్యాయి. కన్యాదాతలు జనకుడు, కుశధ్వజుడు భార్యాసమేతులై గణపతి పూజ చేసి, ఉమామహేశులకు మొక్కి- విఘ్నేశ్వరునికి బియ్యం మీదు కట్టారు. ఆ మీద అయిదు మట్టి పాత్రలలో నవధాన్యాలు విత్తి ఔషధీ సూక్తమంత్రాలతో అంకురార్పణ చేసారు. సీతా ఊర్మిళ మాండవీ శ్రుతకీర్తులను శాస్త్రోక్తంగా పెళ్లికూతుళ్లను చేసారు.
విడిదిలో రామలక్ష్మణ భరత శత్రుఘు్నలను పెళ్లికొడుకులను చేసి స్నాతక కర్మలు పూర్తిచేసి హిరణ్య భూగోదానాలు నిర్వహించి కల్యాణ వేదికకు తరలి వస్తున్నారు. ఊరేగి వచ్చే ఆ నలుగురు పెళ్లికుమారులను మిథిలా పురవాసులు అందరూ వారు వారు చేసే పనులన్నీ ఎక్కడివక్కడ వదిలిపెట్టి పరుగుపరుగున వచ్చి ఆ అన్నదమ్ముల సౌభాగ్యం చూసి పరవశులయ్యారు. ఆ ప్రదేశమంతా ‘రామందాడయె రహదారంతన్’ అంటారు ప్రణవము అనే విశేష వృత్తంలో కవిగారు ‘రామందాడి’- అంటే అసంఖ్యము అని అర్థమని వివరణ కూడా ఇచ్చారు. శ్రీమహాలక్ష్మి అంశతో ఆవిర్భవించిన సీతాదేవి కల్యాణ వేదికకు పార్వతి, సరస్వతి, శచీదేవి మిథిలానగరపు పేరంటాండ్ర రూపాలు ధరించి మహారాణి సుమేధాదేవితో కలిసి సీతాదేవికి మంగళ స్నానాలు చేయించి, తల దువ్వి జడ వేసి వివిధ ఆభరణాలతో అలంకరించారు. సీతాదేవి ఆదిశక్తి మహేశ్వరిని స్తుతిస్తూ గౌరీపూజ నిర్వహించింది.
శ్రీరామ కల్యాణం కనులారా చూసి తరించడానికి బ్రహ్మ, ఇంద్రుడు వైదికుల వేషంలో వచ్చి కూర్చున్నారు. పెళ్లి మంటపంలో శతానందుడు ప్రత్యేకంగా బంగారు సింహాసనాలు తెప్పించి శ్రీరామాదులకు ఇరువైపుల వేయించిన వసిష్ఠుని, విశ్వామిత్రుని పెళ్లి పెద్దలుగా కూర్చుండచేసారు. ఔచితీవంతమైన ఏర్పాటు ఇది. ఆ వెంటనే ఉభయ వంశాల ప్రవరలు పఠఇంచరు.
జనకుడు శ్రీరామునికి నూతన యజ్ఞోపవీతం, మధుపర్కం సమర్పించాడు. బ్రహ్మచారులు తెరసెల్లా వధూవరుల మధ్య పట్టారు. కన్యాదాన మహోత్సవం ఆరంభమైంది. తెలుగింటి పెళ్లికూతురైన సీతను బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు ఎత్తుకుని పెళ్లిపీటల మీద కూర్చోపెట్టారు. జనక మహారాజు సుమేధాదేవి నీళ్లుపోయగా శ్రీరాముని పాదాలు కడిగి భక్తితో శిరసున జల్లుకున్నాడు. ఈ సందర్భంలో శ్రీరామపాదాల వైభవాన్ని- రెండు సీసపద్యాల్లో వర్ణించి తరించారు కవిగారు- 1869, 1871. మంగళాశాసనము- మానినతో ఆరంభించి, పాదాద్యక్షరక్రమ కావ్య నామ విలసిత సీస పద్యం, మంగళ మహాశ్రీ ద్విముఖి, తోటక పద్యాలతో కావ్యాన్ని ముగించారు. ఈ పద్యాల్లో ద్విముఖి అనే పద్యాన్ని గురించిన విశేషాలు తెలుసుకోదగ్గవి. ‘సుముఖి అను పేరుగల పద్య గణములు (నజజన) ద్విగుణీకృతము చేసిన సరిపోవుచున్నవి. అందువలన దీనికి ‘ద్విముఖి’ అని నామకరణం చేసితిని. ద్విముఖి అనగా ఈనుతున్న ఆవు అని అర్ధము. అపుడా గోవుకు ముందు దాని ముఖము వెనుక దూడ ముఖము ఒకేన సమయమున చూడనగును కనుక- ‘ద్విముఖి’ అందుట.
మన ఆర్ష సంప్రదాయమున ‘ద్విముఖి’ దర్శనము చాల ప్రశస్తము. పుణ్యప్రదము. రామాయణ పఠనము, ద్విముఖి దర్శన భాగ్యము పాఠకులకు లభించేలా చేసిన ఆచార్య భీమశంకరంగారు పుణ్య కవులు. వైజ్ఞానిక విషయాను ప్రాణితమై, నూతన భావోత్పలాలతో, వినూత్న ఛందో చంపకాలతో, అలంకార మంజరులతో కూర్చిన రామకథా ధామాన్ని భక్తితో శివార్పణం చేసిన కవివరులు భీమశంకరులు.

విశ్వనాథ సత్యనారాయణగారు తమ రామాయణంలో భాగాలకు ఖండాలు అని పేరు పెట్టారు.
భీమశంకరంగారు కూడా ఆ పద్ధతినే అనుసరించారు. బాలకాండలోని కథను వీరు పదహారు
ఖండాలుగా విభజించి రచించారు. షోడశ కళాప్రపూర్ణుడయిన శ్రీరాముని రమణీయగాథను షోడశ ఖండాలుగా రచించడంతో ఔచితీమండితమైంది. విశ్వనాథవారు రాముణ్ణి నార ముడు! నా రాముడు అంటూ ప్రేమగా పిల్చుకుంటారు. భీమశంకరంగారు నా రాముడు తెలుగురాముడు అంటున్నారు. ఛంద:శిల్పము- విషయానికివస్తే- ఆచార్య భీమశంకరంగారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి వలె సందర్భోచితమైన వృత్తాలను ప్రయోగించి ఔచిత్యాన్ని పోషించారు. రామాయణ పఠనము, ద్విముఖి దర్శన భాగ్యము పాఠకులకు లభించేలా చేసిన ఆచార్య భీమశంకరంగారు పుణ్య కవులు.

- కోలవెన్ను మలయవాసిని, 9949461505