సాహితి

మిర్చి మంటల్లో రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మట్టిని నమ్ముకుని
కాసింత బతుకుని
మిరప నారుగా వుడుసుకొని
రైతు మనసు రెపరెపలాడుతుంది.

పంటంటే
అప్పటిలా కాదు
ఎటుచూసినా మదుపులే.

నీరు కడుతున్నపుడు
గాబు ఎగురుతున్నపుడు
మందులు పులుముతున్నపుడు
మిరపకాయలు కోస్తున్నపుడు
ఇంకా ఆఖరికి గుడారంకి చేర్చే దాకా
అన్నీ ఖర్చులే.

ఇపుడు మొదలవుతుంది
కారం తిన్న గుండెల్లోంచి
కన్నీటి సెగ

గిట్టుబాటు ధర లేక
ఆవేశం మిర్చి మంటల్లోంచి
మండుతుంది.

ఆ క్షణం బాధ్యులెవరో
కళ్ళు విప్పుకుని
జాలి చూపులు విసురుతుంటారు

మట్టి బిడ్డలు మంటల్లో
దహనమవుతుంటారు.

- గవిడి శ్రీనివాస్ 9966550601