సాహితి

వామపక్ష కవులు చెప్పేదేమిటి? చేస్తున్నదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుపాకులతో- తూటాలతో,
డైనమెట్లతో, మందుపాతరలతో సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తూ, అమాయక ప్రజల ధన
మాన ప్రాణాలను బలి తీసుకునే వారిని ప్రేరేపించటానికి, పోరాటవాదులకే బ్రతికే హక్కు- మిగతావారికి
ఆ హక్కు లేదు అని వాదించే కుహనా మానవ పౌర హక్కుల
సంఘాలను ఉసిగొల్పడానికి, సమాజ ప్రశాంతతను సమూలంగా నాశనం చేయడానికి, జాతి
సమైక్యతను దెబ్బతీయటానికి
కవిత్వమే అక్కరలేదు. పుంఖాను పుంఖంగా వ్యాసాలు, జాతి వ్యతిరేక సిద్ధాంత గ్రంథాలు రాస్తే చాలు-
అందరికీ అర్థం అవుతుంది, వామపక్షవాదులు చెప్పేదేమిటో, కోరేదేమిటో.

కవిత్వం అనే ప్రక్రియకు కథ - కథానిక, నవల-నవలిక, నాటకం-నాటిక, వ్యాసం మొదలైన ఇతర సాహిత్య ప్రక్రియలకు ఒక ముఖ్యభేదం ఉన్నది. కవిత్వం అనేది అనుభూతి ప్రధానం. మిగిలిన ఏ ప్రక్రియకైనా వస్తువు, కొంతవరకు శిల్పం- ఇవే ప్రధానాలు.
‘‘నేరెటేటి యసల్‌దెచ్చి నీరజాపు
సాన బట్టిన రాపొడి చల్లి మెదిపి
పదను సుధనిడి చేసెనో పద్మభవుడు
వీనిఁ; గాకున్న కలదె రుూమేనికాంతి
(బంగారు నదిలోని బంగారపు బురదతెచ్చి, సూర్యబింబాన్ని అరగదీస్తే వచ్చే తేజస్సు రజనును ఆ బురదలో కలిపి, బాగా మెదిపి, అందులో కొంచెం అమృతం కూడా చిలికి, ఒక సజీవపు బొమ్మను చేస్తే ఆ ఆకృతి ఎంత మనోహరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో అలా ఉన్నాడు ఇతగాడు. లేకపోతే ఇతర శరీర శోభ ఎలా అమరుతుంది) అని అల్లసాని పెద్దన తన కావ్య నాయిక పాత్ర ద్వారా మనుచరిత్రలో ప్రవర ‘విగ్రహా’న్ని గూర్చి అన్నా;
‘‘గాజు కెరటాల వెనె్నల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్రలోకపు మణిస్తంభాలూ
నా కవితా చందన శాలా సుందర చిత్ర విచిత్రాలు..
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
‘‘అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం, ఆనందం దాని పరమావధి’’ అంటూ మనోజ్ఞ కవితాక్షరాల లక్షణం తిలక్ చెప్పకున్నా;
ఇలాంటి కవితా పంక్తులకు వేటికైనా ప్రాణం, ఆత్మ, ఆయువు- అన్నీ కేవలం అనుభూతి మాత్రమే. ఇందులో ఏ ఇజాల మోజులు, సిద్ధాంత రాద్ధాంతాలు, వర్గ పోరాటాల ఎగదోపులు, పిడివాద మత దురభిమానాలు, వామపక్ష భావజాలాల రెచ్చగొట్టుడులు వగైరాలేవీ కనిపించవు.
కవిత్వం అనేది లలితమైన కళ. అంటే మార్దవంతో కూడిన కళ. కవిత్వపు విలువలను నిర్లక్ష్యం చేస్తూ ఏదైనా రాస్తూ పోతే అది ఒక నీతి శాస్తమ్రో, ధర్మశాస్తమ్రో, రాజకీయ శాస్తమ్రో, ఆర్థిక శాస్తమ్రో, సామాజిక శాస్తమ్రో, విధి-విధానాల ‘స్మృతో’, మఱింకోటో అవుతుంది.
రసము, ధ్వని, అలంకారం, చమత్కరం, శైలి, వృత్తి, రీతి మొదలైన కవిత్వపు విలువలలో కనీసం ఏ ఒకటి- రెండైనా కవితలోని అంశాన్ని అనుసరించి తగినంతగా ఉండాలి. అప్పుడే కవిత్వానికి పరమార్థం సిద్ధిస్తుంది. పరమార్థం ఏమిటి అంటే పాఠకుడికి కలిగే, కలగల్సిన రసానందం- లేక పరమానందం (ఔఖూళ, ఘఇఒ్యఖఆళ, ఉ్ప్యష్ఘఆజ్పళ, ఘూశజిఖజజఒళజూ ఘశజూ ఒళూళశళ ద్ఘఔఔజశళఒఒ, ఔళ్ఘఒ్ఘశషళ ఘశజూ ఔళ్ఘఒఖూళ). ముమ్మటుడు, భామహుడు, అభినవ గుప్తుడు మొదలైన ప్రాచీన అలంకారికులు కూడా ఇదే అన్నారు. ‘వాక్యం రసాత్మకం (రసాత్మకమైన ఒక వాక్యమైనా కవిత్వమే)’ అన్నాడు సాహిత్య దర్పణకారుడు విశ్వనాథుడు. ఇలా ప్రాచీన అలంకారికుల పేర్లు చెప్తేనే సహించలేని నాటి వామపక్ష భావజాల వ్యాసరచయితలలో ఒకరు ఇటీవల ఒక పత్రికలో ‘నేటి మన కవులు, రచయితలు 19వ శతాబ్దం దాటి ఆలోచించలేకపోతున్నారు. నేడు ఆధునికత ద్రవస్థితిని దాటి వాయుస్థితిని పట్టుకొని అతివేగంగా ప్రపంచాన్ని చుట్టివస్తోంది. అయితే మన సాహిత్యవేత్తలు మాత్రం యుగ కవుల, మహాకవుల, భావ కవుల సాహిత్యాలలోని ఓనమాలను దిద్దుకుంటున్నారు ఇంకా. గతకాలపువారి భావజాలానే్న మనమీద కప్పబోతున్నారు’’ అని ఒక అభియోగాన్ని ధ్వనించారు.
మరి పాశ్చాత్య సాహిత్య విమర్శకులు కూడా ప్రాచీన అలంకారికుల భావనాధోరణిలోనే తమ అభిప్రాయాలు వెలువరించారే! ‘జ్ద్ఘీఆ జఒ ఔ్యళఆక ఇఖఆ ఆ్దళ ఆ్ద్యఖదఆ ఘశజూ త్యీజూఒ జశ త్దీజష్ద ళ్యౄఆజ్యశ ఒఔ్యశఆ్ఘశళ్యఖఒక ళౄఇ్యజూజళఒ జఆఒళజఛి’’ (కవిత్వం అంటే భావావేశం (రసభావం) తనంత తాను తాల్చెడి సహజ శబ్దార్థ స్వరూపం కాక మరేమిటి?’’ అన్నాడు జాన్ స్టువర్ట్‌మిల్. ఇది విశ్వనాథుని ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న సూక్తికి ఆంగ్లీకరణంలాగానే ఉంది ఇంచుమించుగా. ‘-్యళఆక జఒ ఘ ౄఖఒజష్ఘ ఆ్ద్యఖదఆ (ఒక భావాన్ని కళాత్మకంగానో, అందంగానో చెప్పటం కవిత్వం)’’ అన్నాడు కార్లైల్. మన జగన్నాథ పండితుడు ‘రమణీయార్థ ప్రాతిపాదక శబ్దః కావ్యం (అందంగానో, చమత్కరంగానో చెప్పటమే కవిత్వం)’’ అని అంతకుముందే ఎప్పుడో నిర్వచించాడు. వాస్తవం ఇలా ఉంటే పాత సాహిత్య సిద్ధాంతాలను మనకు పులుముతున్నారు అని వామపక్ష కవులు, రచయితలు అనటం సమర్థనీయం కాదు. వామపక్షవాదులు అక్షరానికి అంతర్జ్వాల ఉండాలి అంటున్నారు. అక్షరం అక్షరమైన (నాశనము కాని) పద కుసుమంలో ఒక రేకుగా మిగిలిపోవాలంటే కావలసింది ఆర్ద్రత, సార్వజనీనత, సార్వకాలికతలు. అంతేకాని చలికాలంలో తాత్కాలికంగా వేసుకునే, మండి చల్లారిపోయే భోగిమంటల చిటపటలు కాదు ఉదాత్త కవిత్వం అంటే.
కవిత్వంలో ప్రత్యక్ష ప్రతిఅక్షర పద అర్థం కంటే ముందుగా ఉండాల్సింది ఒక అనిర్వచనీయమైన - మాటలకందని - అనుభూతి. అలాంటి అనుభూతిని మాటల మధ్య ఇమడ్చడానికి చేసే ప్రయత్న ఫలితమే మనోజ్ఞమైన కవిత్వం. ఈ భావానే్న వ్యక్తపరిచాడు ఆంగ్ల కవి టి.ఎస్.ఇలియట్. ‘ ష్యశఆఖశఖ్ఘ ఘూజజూ యశ ఆ్దళ జశ్ఘూఆజషఖ్ఘఆళ (అనిర్వాచ్యమైన తత్త్వం మీద నిరంతరంగా కవి జరిపే దాడి కవిత్వం)’’ అంటూ. అర్థం అవటానికి ముందే అనుభూతం అయ్యేది కవిత్వం. పాఠకుడి నాడీ మండలానికి విందు చేయాలి కావ్యం ముఖ్యంగా- ఇలియట్ దృష్టిలో.
పింగళి సూరన తన కళాపూర్ణోదయ కావ్య ప్రథమాశ్వాసంలో ‘చలువగల వెనె్నలల చెలువునకు సౌరభము కలిగినను’’ అంటూ మొదలయ్యే పద్యంలో ‘వెనె్నల చల్లగా ఉంటుంది. కానీ దానికి కమ్మని వాసనంటూ ఏమీ లేదు. అటు చల్లదనమూ, ఇటు వాసన- రెండూ కలిగి ఉన్నది కర్పూరపు గుళిక. అయితే కర్పూర ఘన పదార్థం. అంటే కఠినత ఉన్న వస్తువు అది. కోమలత, ఎరుగదు. మరి కోమలత కూడా ఉన్నది ఏది అంటే మలయమారుతం. చంద్రికకు మించిన చల్లదనం, కర్పూరం కన్న కమ్మని సౌరభం- ఆ రెంటికీ లేని మార్దవం తనలో కలిగి ఉన్న మలయమారుతానికి రుచి అనేది లేదు. రుచులకు రాజు తీయదనం. అసలు రుచే అనేది లేనప్పుడు ఇంక తీయన అనే దాని ప్రసక్తే లేదు. మరి అది కూడా అమరి వున్న వస్తువు సృష్టిలో ఉన్నదా? ఉన్నది. అది ఏది అంటే అదే సుకవి వాక్కు- పరమోదాత్త కవిత్వపు పలుకు’’ అని- ఇలా ఒక ఆరోహణక్రమంలో గ్రాఫిక్‌గా సారాలంకారంలో కవిత్వ కళ యొక్క ఉత్కృష్టతను సంభావించాడు.
పద్యం చివరలో ‘సుకవి’ అనే పదం ప్రయోగించాడు సూరన. అంటే సుకవిత్వం యొక్క లక్షణం ఏమిటో తెలియజేశాడు. ‘సుకవి నిల్చెను (నిల్చును) ప్రజల నాలుకల యందు’ అన్న జాషువా కవీశ్వరుని దృష్టిలో ‘సుకవి’త్వ లక్షణానికి సూరన గారిచ్చిన నిర్వచన భావ నేపథ్యమే మూలం. కవిత్వంలో అనుభూతి, సుకుమారత, మార్దవం ప్రధానంగా ఉండాలి గాని అంత మాత్రం చేత కథా కావ్యాలు, ఇతిహాసాలు, చారిత్రక- జానపద కావ్యాలు రాసేటప్పుడు వీర, రౌద్ర, భయానక, బీభత్స రస సన్నివేశాలలో కొంత భాషాడంబరత, భావ సంకీర్ణత, భావోద్రేక భావావేశాల ప్రకటన, దూకుడు రసోచితంగా ప్రదర్శించకూడదని కాదు చెప్పేది. కానీ, రుూనాడు తమ తమ భావజాల ప్రచార కవిత్వాలకు, ఇజాల రాజుళ్ళకు, సమాజంలో వర్గ పోరాటాలను రగిలించటానికి, మైనారిటీలను రెచ్చగొట్టడానికి, స్ర్తివాదాన్ని వెఱ్ఱి తలలు వేయించటానికి, ప్రాంతీయ దురభిమానపు సెగలను ఎగదోయటానికి, మానవ వినాశకర ఉగ్రవాదానికి పల్లకీ మోయటానికి, పరిశ్రమలలో అస్థిరతను సుస్థిరం చేయటానికి, వేర్పాటువాదాన్ని సమర్థించటానికి, తుపాకులతో- తూటాలతో, డైనమెట్లతో, మందుపాతరలతో సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తూ, అమాయక ప్రజా తమ ధన మానప్రాణాలను బలి తీసుకునే వారిని ప్రేరేపించటానికి, పోరాటవాదులకే బ్రతికే హక్కు- మిగతావారికి ఆ హక్కు లేదు అని వాదించే కుహనా మానవ పౌర హక్కుల సంఘాలను ఉసిగొల్పడానికి, సమాజ ప్రశాంతతను సమూలంగా నాశనం చేయడానికి, విశ్వవిద్యాలయంలో ‘్భరత జాతి ఒక జాతి కాదు; అది బహుళ జాతి సమ్మేళనం’ అంటూ జాతి సమైక్యతను దెబ్బతీయటానికి కవిత్వమే అక్కరలేదు. పుంఖాను పుంఖంగా వ్యాసాలు, జాతి వ్యతిరేక సిద్ధాంత గ్రంథాలు రాస్తే చాలు- అందరికీ అర్థం అవుతుంది, వామపక్షవాదులు చెప్పేదేమిటో, కోరేదేమిటో.
అరాచక కవిత్వాలు, లయ ద్వేష కవిత్వాలు, భయోత్పాత కవిత్వాలు, రక్తపాత కవిత్వాలు, శబ్దైక పక్షపాత కవిత్వాలు, వివాదోద్యమ కవిత్వాలు, ఇజాల ఈటెల కవిత్వాలు, ఆవేశ కవిత్వాలు, ఆక్రోశ కవిత్వాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, రోకటి పోటు పాటల విన్యాసాలు, హింసాచరణ మహన్న్యాసాలు మొదలైన వాటికి వకాల్తాలు, అక్షరాచరణ కార్యక్రమాలు కాదు నేడు సమాజ శ్రేయస్సుకు కావలసింది. ఉదాత్త కవిత్వపు విలువలకు సమాధి కట్టేవారు వారు తీరు మార్చుకొని, జాతికి స్వధర్మాచరణ జవసత్త్వాలు కలిగించే రచనలు చేయాలి నిజంగా అక్షరోపాసకులైతే.
సైనిక సోదరుల మీద రాళ్ళు విసురుతున్న కాశ్మీరులోని కిరాయి రౌడీలమీద ఎక్కుపెట్టండి మీ రచనాస్త్రాలు. మూతి ముడుచుకొని మూడుసార్లు నీ బ్రతుకుకు నా బాధ్యత లేదు, నీవు నా ధర్మపత్నివి కాదు అనే అమానుష ఛాందసవాదుల మీద గురిపెట్టండి మీరు కవిత్వం అనుకుంటున్న మీ కవితాశస్త్రాలు. నీతిని పాతిపెట్టే బూతు మాటల- పాటల చలన చిత్రాల నిర్మాతలు- దర్శకుల మీద విసరండి మీ వ్యాసాల శిలాసముచ్చయాలు. రాజకీయం అంటే అరాచకీయమే అనే ధోరణిలో సాగిపోతున్న కొందరు దుర్మార్గ రాజకీయ నాయకులను చీల్చి చెండాడండి మీ పత్రికా శులాయుధ సంపత్తులతో. తెలుగు భాషామతల్లిని ఖూనీ చేస్తున్న కొన్ని టీవీ ఛానెళ్ళమీద కురిపించండి మీ సాహితీ ప్రతాపాగ్ని కీలలను. లంచగొండి ప్రభుత్వోద్యోగులు- అధికారులు ఉన్నచోట పడండి దుర్వార విశృంఖల రచనా అశనిపాతాలుగా. అంతేగాని అశాశ్వతమైన, అధర్మపూరితమైన నిరర్థకపు జాతి సమైక్యతా వ్యతిరేక వితండ సాహిత్యపు పోరాటాల తాటాకు మంటలతో మీకున్న కవితా కళాప్రతిభను తగలబెట్టుకోకండి. కవిత్వం కడు సుకుమారం. కాకూడదు దురుపయోగం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం, 9849779290