సాహితి

అక్షరం తలవొంచదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవడైతే నాకేంటి?!
వాడు ఏమైతే నాకేంటి?!

మదమెక్కిన మృగమైనా
గద్దెక్కిన గజమైనా
నీతిని కరచిన అవినీతి త్రాచైనా
సాములోరైనా, స్కాములోరైనా
వాడివైపు నా చూపు శరంలా దూసుకెళ్తుంది
మస్తిష్కంలో శతఘ్నిలా పేలుతుంది

వాడి రహస్య కదలికలను వెలికితీస్తా
చీకటి ఒప్పందాలకు చితి పేరుస్తా

కాగితం మీదనుంచి
కన్నులోకి వెన్నులోకి దూకి
అమాయకులకు వెన్నుదన్నుగా,
పెన్నుగన్నుగా నిలుస్తా
వేనవేల సూర్యుళ్లను మొలిపిస్తా
వేడి వాడి కిరణాలను ప్రసరిస్తా
నిరంతర పోరాటం నా నైజం
నిజమై నిర్భయంగా ప్రవహించడం నా ఇజం

నినాదమై గర్జిస్తా
నిప్పుకణికనై జ్వలిస్తా

రాతలతో తలరాతలను తిరగరాస్తా
చేతివేళ్ల కొసలపై ఖడ్గచాలనమై విరబూస్తా
తరాల అంతరాలను దాటి
నిరంతరం చరించి, ధ్వనించి, ఫలించి
నిటారుగా నినదిస్తా

నేను అక్షరాన్ని
ఎవడికీ తలవొంచను

- సాహిత్య ప్రకాష్ 9703287555