సాహితి

ప్రవాహ వేగంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త గొంతులు
నిర్భయంగా నడిచిన నేలమీద
కోరికల చిగురు
కలల మారాకు వేసి
బతుకు మీద ఆశగా మొలకెత్తవూ...?

కాలాన్ని దోసిట్లోకి ఒంపుకొని
ప్రవాహ వేగాన్ని
గడగడా తాగినంత సేపూ
మనిషికి
కొత్త ఊహలే పుట్టుకొస్తాయ

స్తబ్దతలోంచి
చైతన్యంతో తట్టి లేపడానికి
పరిచిన అడుగులన్నీ
నవ నవోనే్మషంగా మొగ్గ తొడుగుతాయ

నీటి స్పర్శ
గాలి కరచాలనం
నిప్పుల జడివాన
మట్టి కలవరింత
మేఘాల రెపరెపలు
పంచభూతాల వెలుగులో
కొత్త ప్రపంచాన్ని తట్టిలేపుతాయ

ఆలోచనల చిగురు
గూడు కట్టిందో
కలల వంతెన మీద
ఊహలు బద్దలవుతూ ప్రకంపనలు సృష్టిస్తాయ

బహుశా
నిద్రలో సైతం
నడవడం నేర్చుకోవాలేమో!

వర్తమానంలోని
భవిష్యత్తు ప్రతిబింబాన్ని తడుముతూ
నిట్టూర్చే క్షణాల మధ్య
ఒద్దికగా ఒదిగిపోదాం

అప్పటిదాకా
సెలవా మరి!

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910