సాహితి

నీకై నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండిన పొలాన
నా కవితలోని తడితో
చినుకునై వర్షిస్తా

ఇంకిన రైతు నయనాన
నా కన్నీటితో గట్లు కట్టి
మడిగా మారుస్తా

చెట్టు కొమ్మకు వేలాడే
అన్నదాత పాదాలకు
నా భుజాలనే ఆసరా చేస్తా

తన ఆశలు నా ఆశయాలు
ఇద్దరి జీవిత మాగాణిలో
రెండు కాడెడ్లు

గిట్టుబాటు ధరకై
నా నోటితో అడుగుతా
నా కలంతో కడుగుతా

నా ఐదు వేళ్లూ నోటికి చేర్చే
అన్నదాత ప్రాణాల్ని
పంచభూతాల్లో కలవనిస్తానా

కబళం పెట్టి ఆకలి తీర్చి
మా జీవితాల సేద తీర్చిన
నీ ఆయువు మాకు ప్రాణప్రదం

- జంధ్యాల రఘుబాబు 9849753298