సాహితి

నేటి స్మార్ట్ సిటీస్‌తో పోల్చుకునే ‘1960’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొడుక్కి పాతికేళ్లు వచ్చి చాలా అప్పులులోకి, తగాదాల్లోకి, జూదాలకీ దిగాడనుకోండి. అతనిమీద చాలా జాలిపడి తండ్రి ‘పిల్లవాడివిగా వున్నప్పుడు ఎంత శాంతంగా, సంతోషంగా, నిర్మలంగా వుండేవాడివి!’ అని బలవంతంగా తండ్రి బొమ్మలూ అవీ ఇచ్చి ఆడుకోమంటే అతనేవౌతాడో దేశమంతా అట్ల ఐనట్టుంది’ అని వ్యాఖ్యానం చెబుతాడు కధకుడు- రుూ కధ చివరలో.
దేశ స్వాతంత్య్రం రాకముందు కాకపోయినా, వచ్చిన మొదటి సంవత్సరంలోనే భవిష్యత్తును ఊహించి రాసిన కథ ఇది. దీని పేరు ‘1960’. రచయిత శ్రీ గుడిపాటి వెంకటచలంగారు. సాధారణంగా రుూయన కథలు స్ర్తి పురుష సంబంధాలను గురించి, స్ర్తిలకు ఇవ్వవలసిన స్వాతంత్య్రం గురించే వుంటాయి. ఆ రోజుల్లో ‘నీతిపరులు’ అనుకున్న ఘరానా మనుషులు బాహాటంగా చదివి ఆనందించటానికి నోచుకోని కథలు. అయినా ఆయన స్ర్తి పురుష సంబంధాలను గురించి కాకుండా, సామాజిక వర్తన రీతులను గురించి సాధారణీకరిస్తూ రాసిన కథలు కూడా వున్నాయి. నాటికీ స్వాతంత్య్ర వాసన కొద్దో గొప్పో వుండనే వుంది. ‘అప్పుడు ఇప్పుడు’ అనే కథ, రామభక్తుడు అనే కథ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ‘1960’ అనే రుూ కథలో రచయిత దాదాపు రెండు దశాబ్దాల తరువాత దేశం ఏ రకంగా రూపొందుకుంటుందో ఊహించి రాసిన కథ. ‘్ఫ్యచరిస్టిక్ స్టోరీ’కి నమూనాగా దీనిని చెప్పుకోవచ్చు.
కథనం అంతా రచయిత ఉత్తమ పురుషలో సాగుతుంది. ‘పదేళ్లకు స్వదేశానికి తిరిగి వచ్చాను. ఇండియా రాయబారి కింద నన్ను జులూలాండ్‌కు పంపారన్నమాట జగద్వితమే’ అంటూ ప్రారంభం అవుతుంది కథనం. రాయబారి హోదా రావటానికి ఆయన చేసిన స్వాతంత్య్రోద్యమ చర్యలు అలవోకగా చెబుతాడు. ఆ దేశంలో వున్నప్పుడు ఎలా జనాదరణ పొందింది- ముఖ్యంగా స్ర్తిలవల్ల సన్మానాలు పొందిందీ చెబుతాడు. తన ఉద్యోగం వున్నదా, వూడిపోయిందా అనే సంగతి కూడా తెలియని పరిస్థితిలో మళ్లీ ఇండియాకు రావాలని పూనుకుంటాడు. ఇండియాలో ‘గొర్రెపూడి’ అనేది ఆయన స్వగ్రామం. అక్కడ చెల్లెలు, ఆమె భర్త ఇంకా వున్నారు. ‘ఇండియా’ అనే దేశం ఎక్కడ వుందో రేవుపట్నంలోని ఆఫీసర్లు వొకంతట చెప్పలేకపోతారు. ‘సయాంకి తూర్పుగా, చైనాకి నైరుతిగా వుండేది పూర్వం’ అని చెప్పగలుగుతారు. దీనికి కారణం ఏమంటే ఇండియా స్వయం నిర్ణయం చేసుకునే దేశం అయిపోవడం, ఇతర దేశాలతో ప్రాంతాలతో ‘సహాయ నిరాకరణం’ చేస్తూ వుండడం. అంతా ఖద్దరుమయం అయిపోయారు ప్రజలు, ఉద్యోగులు. ఎలాగో బొంబాయికి చేరుకుని అక్కడినుంచి రైలు పట్టుకుని తన గ్రామానికి వెళ్లాలి. రైళ్లు విరివిగా వుండవు. ఒక పెట్టె రైళ్లే. ప్రజలు ప్రయాణం చేయరు. టెలిగ్రాం ఆఫీసులు కూడా తిన్నగా పనిచేయవు. ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా వుంటుంది కనుక యితర ప్రాంతాలతో అంతగా పరిచయాలు వుండవు. తను కూడా తెచ్చిన విస్కీ బాటిల్స్ ఇక్కడ మిగిలిపోయిన ఇంగ్లీషు ఉద్యోగులకు ఆనందం, సంతోషం కలిగిస్తాయి. అతను కూడా విస్కీ తాగి మొద్దునిద్రపోతాడు. తెల్లవారి లేచేసరికి షోలాపూరు చేరుతాడు. అప్పటికి కొత్త పరిస్థితి మరికాస్త ఆకళింపు అవుతుంది. ‘పరిశ్రమలన్నీ కుటీరాలలో చేరాయి. మిల్లులు మానేశారు. పెద్ద పెద్ద పట్టణాల్లో తిండి లేదు. బియ్యం కూడా పట్టణాలకు ఎగుమతి మానారు. వాణిజ్యం అసలు లేదు. తిండి లేక అందరూ పల్లెటూళ్లు చేరుకున్నారు. వాళ్లు అస్తిపంజరాలు. ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. డబ్బూ లేదు. ఎరువు బళ్లు మాత్రం మిగిలాయి.
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తోంది. కమ్యూనిస్టుల దెబ్బకి దడిసి, వాళ్ల పద్ధతుల్ని కాంగ్రెస్ తానే ప్రవేశపెట్టడం మూలాన, వాళ్లు కాంగ్రెస్‌లో కలిసిపోయినారు. దేవాలయాలలో హరిజనులు ప్రవేశించినందువల్ల హిందువులు వెళ్లడం ఆపేశారు. వాళ్లకు వ్యతిరేకత లేకపోవడంవల్ల హరిజనులూ వెళ్లడం లేదు. కాఫీ, టీ దొరకవు. మద్యపాన నిషేధం. పొగాకు, కాఫీ, టీ, మాన్పించేశారు కార్మికులు. అందరూ ఖద్దరు వడుకుతారు. అతను వూరు చేరుకున్నాక, పరిస్థితి మరింత బాహాటంగా అర్థం అయింది. ‘మా వూరు స్వరూపమే మారిపోయింది. చక్కని, గుంటలు లేని రోడ్డు. చుట్టూ తోటలు, పైర్లూ. ఒక్కరవ్వ చెత్త, మురికి ఏమీ లేవు. మా బావ కూడా బనియనూ, చెడ్డీ వేసుకుని నా డ్రెస్సు వంక వింతగా చూస్తున్నాడు.. వూరు దగ్గరకు వచ్చేసరికి తెల్లారుతోంది. పాటలు పాడుకుంటూ మగవాళ్లు పొలాలకి పోతున్నారు. ఆడవాళ్లు గుమ్మాలు వూడుస్తున్నారు. బావ పొలానికి, చెల్లెలు ఇంటి పనులలోనికి మునిగిపోయి, ఇతని వివరాలేవీ కనుక్కునే ప్రయత్నమే చేయరు. గాంధీగారి పాకీదొడ్లు, కుర్రవాడి చదువు పరిస్థితి కూడా అదేదో వింతగానే కనిపిస్తుంది. ఎవరేనా ఎవరి ఇంట్లోనయినా భోజనం చేయవచ్చు. హోటళ్లు లేవు. అందరూ 11, 12 మధ్య భోజనం చేసి తీరాలి. కొనుగోలు దుకాణాలు లేవు. భూమి అంతా పండేసి, ప్రాజెక్ట్ ఫారమ్‌లోనే పంటలు. చదువులు కూడా కొత్తరకం. పరిశీలన ఎక్కువ. ‘ప్రతి ఇంటిలోనూ ఎలక్ట్రిక్ లైట్లు. శుభ్రంగా వున్నాయి ఇళ్లు. పాత ఆచారాలన్నీ పోయినాయి’. కొత్త మార్పుల్ని గురించి పరిశీలించినప్పుడు ప్రజలు అంత సుఖంగా కనిపించరు. ‘ఇక్కడ ఈ లోకంలో అశాంతి, తీరని కోరికలు వున్నంతకాలం అవన్నీ ఆ లోకంలో (స్వర్గంలో) వుండవనీ, సత్యం, శాంతీ, సౌఖ్యం ఇవన్నీ అక్కడ వుంటాయనీ కలలుకన్నాము. కాని అవన్నీ రుూ లోకంలోనే లభ్యం అయితే, కలలు కనడానికి ఏమీ మిగలలేదు. పనిభారం పెరిగిపోయింది. మానవ స్వభావం విచిత్రం. దాన్ని అంకెలలోకి, ఫార్ములాలోకి మార్చి యోచించడం బుద్ధి తక్కువ. ‘పనీ కావాలి. పనీ అక్కర్లేదు. ఇప్పుడు మనిషికి పని తక్కువ కావాలని వుంటుంది. కాని ఉన్న పని భారం- జీవితానికీ కళకీ సంబంధం తెగిపోయింది. బాధలు, భయాలు వస్తాయని లేదు. జీవితాన్ని అంతటినీ ఏదో నిరాశ ఆవరించినట్లుగా అయింది. మార్పు కావాలనుకున్ననాళ్లూ బాగా వుంది. తీరా ఆ మార్పు వచ్చిన తరువాత అసంతృప్తే మిగిలింది. మానవ స్వభావం, చిత్రవృత్తులలో వచ్చే మార్పులను గురించి పరిశీలనాత్మకంగా ఊహించిన కథ ఇది. ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసుకోవటానికి స్మార్ట్ సిటీస్ గురించి పలవరించడానికి పనికివచ్చే కథ.

- శ్రీవిరించి, 09444963584