సాహితి

మధ్యతరగతి మందహాసంలో మార్మిక గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కూతురు పెళ్లి విషయమై రాఘవయ్య చెవులో పిండిమర పనిచేస్తున్నట్లు పనిచేస్తూనే వుంది రాజమ్మ. రాజమ్మకు కూతురు దొడ్లో తోటకూర మొక్క పెరిగినట్లుగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఏదో విధంగా ఎందరికో పెళ్లిళ్లవుతున్నాయి. మరి దీనికి కాదేం?- ఇదీ ఆ మధ్యతరగతి దంపతుల ఆవేదన.
‘కూతురు పెళ్లి’ అనే శ్రీ మాధవపెద్ది గోఖలే కథానికలో సన్నివేశం యిది. గోఖలే కథ అనగానే బీదవాళ్లు, వాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించే మనసుకు గుర్తువస్తుంది. ‘బిళ్లల మొలతాడు’ యిందుకు తార్కాణం. అయితే, ప్రత్యేకంగా ఒక పద్ధతికి ధోరణికి అలవాటయిన మనిషి కూడా అప్పుడప్పుడూ దారితప్పినట్లుగా కనిపింపచేసే రచనలు చేయడం పరిపాటి. అటువంటిదే ఈ కథ.
ఈ మధ్యతరగతి దంపతులకు ఒక కూతురు. ‘కుందేలు పిల్లకు మల్లే యింట్లో తిరుగుతూన్నది- బెదురుచూపులతో’. ఈ పిల్లకు ఓ సంబంధం వెదుక్కుంటూ వచ్చి వాళ్ల ఇంటిముందు వాలింది. ఆ పెళ్లికొడుకు గురించి పూర్వాపరాలు చర్చించుకుంటూ వుంటారు కథా ప్రారంభంలో. తరువాత తమ వివాహం జరిగిన తీరు, భార్య యే రకంగా కాబోయే భర్తను ఆచి తూచి గమనించినదే ప్రస్తావించుకుంటారు. మధ్యతరగతి సంసారపు పోకడలు రుూ కథానికలో చక్కగా వ్యక్తం అవుతాయి. మొదటి చూపులో ‘అయిష్టత’ గోచరించినా, సంసారంలో స్థిరపడి రోజులు - సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ ఎట్లా సమాధాన సరళి ఏర్పడుతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
ఇంతకూ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఎట్లాంటిది? పదివేలు కట్నం ఇచ్చినా దొరకని సంబంధం. దమ్మిడీ కట్నం లేకుండా జరగబోతోంది ఈ వివాహం. పిల్లవాడికి యిరవయి అయిదు- ముప్ఫై సంవత్సరాల వయసు. రైలు ప్రయాణంలో అలసిపోయి ఉన్నాడు గనుక మరీ వయసువాడుగా కనబడుతున్నాడని సమాధానపడతారు. నల్లనివాడు, పచ్చనివాడు కాదు. కాకపోయినా ‘రంగు సంగతంత ముఖ్యం కాదు’ అనుకుంటారు. పిల్లవాడికి ‘బైట తిరగటాలు’ వున్నాయనే విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ‘మొదట చేసుకున్న పెళ్లాం పిచ్చిముండై చస్తే రుూడొచ్చిన మొగవాళ్లేం మడిగట్టుకుంటారా?’ అని తమను తామే ప్రశ్నించుకుని ‘నిక్షేపంలాంటి పిల్లవాణ్ణి కాస్తా పట్టుకుని, లేనిపోని పాపం అంటగట్టడం అన్యాయం’ అని సమాధానపరచుకుంటాడు. ఇరవయి వేల ఆస్తిపరుడు అతి చవుకగా తమకు అల్లుడయిపోతున్నాడని సంబరపడిపోతూ ‘వరప్రసాదు’ యింటి ముందరకు వచ్చి అదృష్టం తమను వరిస్తోందని సంతోషిస్తారు.
సంభాషణ అప్పుడు తమ పెళ్లి సమయం- సందర్భం గుర్తుతెచ్చుకుంటారు. అప్పుడు తనకు భర్తను (పెళ్లికొడుకును) చూస్తే డోకు వచ్చిందని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది ఆ భార్య, యిరవయి యేళ్ల సంసారం చేసిన తరువాత. మళ్లీ తనే, సముదాయించుకుని ‘మా అమ్మమ్మ బలవంతం చేసింది గనుక అంగీకరించక తప్పలేదు’ అంటుంది. అమ్మమ్మను నాలుగు తిట్లు తిట్టి తరువాత ‘చిన్నతనం ముందు చేసుకోనన్నాను, అలవాటు అయిన తర్వాత అంతా బాగానే వుంది’ అని మురిపెంగా చెబుతుంది. కూతురుకు వచ్చిన పెళ్లి సంబంధం యిద్దరికీ నచ్చిందని అంగీకారం అయిన తర్వాత ‘తథాస్తు’ అనుకుంటారు.
మొదటి చూపులో అంత అంగీకారం కాకపోయినా, సంసారం కొన్నాళ్లు గడిచిన మీదట భార్యాభర్తలు ఎట్లా సమాధానపడిపోతారో, అలాగే పిల్లల సంబంధాల విషయంలో కూడా ఎలా కాంప్రమైజ్ చేసుకుంటారో- అభ్యంతరాలుగా కనిపించిన అంశాలు కూడా ధనాభావంవల్ల ఎలా మరుగయిపోతాయో తెలియచెప్పే కథ యిది. సంసారిక కథలలో సరసమయిన శృంగారాన్ని ప్రదర్శించే వస్తువు, సౌజన్యం కూడా.

- శ్రీవిరించి, 09444963584