సాహితి

జారిపోయిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాంతపు ప్రవాహమీది నుంచి
ఒంటరి తెరచాపవై
రెపరెపలాడుతూ వస్తానని
వాగ్దానం చెయ్యలేదూ నువ్వు!
నిమ్మళపు జల ఫలకమీద
చిల్లుల గుడారానివై వాలి
జీవన గర్భంలోంచి
తడి అనుభవాలను తొడి తెచ్చి
కుమ్మరిస్తానని వొట్టేసి చెప్పలేదూ నువ్వు
వేనవేల కళ్ళ వేణువునై
తీరమీద కూచుని
శోక రాగాల్ను
శ్రుతి చేసుకుంటూనే ఉన్నాను గదా
గుండె పాతర్లో దాచి ఉంచుకున్న గుసగుసల్ని
గుప్పెళ్ళు గుప్పెళ్లుగా తీసి
నీ పరధ్యానమీదికి వొంపాలని
ఎదురెదుర్లౌతున్నాను కాదా
పలకరించకుండానే తీరా
పాట జారిపోయి కనుమరుగైంది
వ్యథా జ్ఞాపకపు వడ్రంగి పిట్ట
గుండె కొండమీద వాలి
అదే పనిగా పొడుస్తూనే ఉన్నది.

- సిహెచ్.వి.బృందావనరావు