సాహితి

షరా ‘మామూలే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కారీ కొలువుకి నెలవైన
అధికారపు అంగట్లో
ఉత్తరాభిముఖ ఆసనం
దక్షిణాదులకమ్ముడుపోయ
మాన మర్యాదలన్నీ మూలగట్టి
అవినీతి అసురార్చనలో
నిస్సహాయ చెమట చుక్కలన్నీ
‘కట్టల’పాము పొట్టలో
పాలుపంచుకునే తీర్థప్రసాదాలౌతాయ
సిగ్గూ-శరాన్నీ... ఆత్మసాక్షిని
అవినీతి సొరచేప నోటికి ఎరగా వేసి
బంగరు పళ్లేన భుజించే భక్ష్యం
కన్నీటి కుత్తుక కెతికే మెతుకౌతుంది
చలువటద్దాల సౌఖ్యాలన్నీ
అశాంతి ప్రేరేపిత ప్రేతాలై
కంటికునుకుని కాపలా కాస్తాయ్
వందగొడ్లను తిన్న రాబందు
భారీ తిమింగలమై
చట్టం పన్నిన ఉచ్చులో చిక్కుబడుతుంది
మోహరింపుల పహారాలన్నీ ఫక్కున నవ్వి...
పక్కన చేర్చుకుంటాయ్
కక్కిన కూడు రుచిమరిగిన దోపిడీ
షరా ‘మామూలై’... శిక్షలనధిగమిస్తూ
అవినీతి శిక్షణలో పెద్ద బాలశిక్షలౌతాయ..

- ఇల్ల ప్రసన్నలక్ష్మి, 9494165632