సాహితి

కిచిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీడియా వార్తలను
వండి వడ్డిస్తుంది

‘గౌరీ లంకేశ్ హత్య’

‘ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు’

‘ఆన్‌లైన్ ఊబిలో మరెన్నో బ్లూవేల్స్’

ఇది పక్కా లెక్క భూ రికార్డుల శుద్ధీకరణ

‘డిసెంబర్ నాటికి ఇంటింటికి నీళ్లు’

‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా
ప్రాజెక్టులు కట్టి తీరుతాం’

‘అమరావతి డిజైన్లు రాజవౌళి పరిశీలనకు’

‘సన్యాసినిపై సామూహిక లైంగిక దాడి’

‘మద్యం దరఖాస్తులతోనే ఖజానాకు 350 కోట్లు’

‘రోహింగ్యాల రోదన
తిండిలేక బట్టలేక దుర్భర జీవితం’

‘న్యాప్‌కిన్స్‌పై జిఎస్టీ రద్దుచేయండి’
ప్రధానికి విద్యార్థినుల లేఖలు

‘ఉత్తర కొరియాకు ట్రంప్ హెచ్చరిక’

‘పోలవరం.. కాంట్రాక్టర్లకు వరం’

‘హెచ్ - 1బీ మళ్లీ షురూ’

‘సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం’

‘ఆన్‌లైన్‌లో తొంభైశాతం
పండుగ డిస్కౌంట్ సేల్’

‘రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం’

‘గుర్మీత్ రోజు కూలీ ఇరవై రూపాయలు’

పాఠకులు కొనుక్కొని
కుర్‌కురేలా కరకరా నములుతారు

దృశ్యాలను గుడ్లప్పగించి
సొల్లు కారుస్తూ చూస్తారు
పల్లెత్తు మాటా అనరు
గొంతెత్తి ప్రశ్నా వేయరు
పూర్తిగా చచ్చి కదలకుండా
పడి వున్నట్టూ కాదు
సజీవంగా బతికి
ప్రవహించినట్టూ కాదు

ఎడ్లు ఎట్ల పోతేంది
వడ్లు గాడ్పుకు పోతేంది
మన లోకం కడు భద్రంగా
ఉంటే చాలు.. అదే పదివేలు

- జూకంటి జగన్నాథం, 9441078095