సాహితి

మొలక నవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్తు నీవంటే
గమ్మత్తు ఇది
మొదలంటే ‘‘అది’’ తెలుసా?
అప్పటి మొలక నవ్వు నాది
హృదయాకాశంలో జిగి వెనె్నల కురుస్తోందా?
వాన చినుకు ఒకటి టక్కున పలకరిస్తే
నేనిలలో ఉన్నట్టు తెలిసిందిలే
నన్ను చూసినప్పటి నిన్న మొన్నటి
మందహాసమొకటి
మింటి చుక్కై వెలిగిపోతోంది.
గగన మెక్కలేను కదా ప్రియతమా
ముద్దుగుమ్మనై శృంగార గర్వంతో
ఒకింత అతిశయము చూపించిన మాట నిజమే
అది వలపు చిగిర్చిన మధురోహ!
పూల తేనెల తొలి తీయని సామీప్య ముక్తాయింపు
ఒయ్యారపు తీవె పందిరిలో
సొంపుగా ఒదిగిన ముకుళితనై
నీ మునివేళ్ల స్పర్శతో పులకించిన
లేలేత చిగురు కొమ్మల నడుమ సన్నజాజిని
మక్కువ మీరగ కొనగోట మీటితే సిగ్గుల మొగ్గనై
ఇంకా నిలిచి ఉన్న రేయిలో లేలేత వలపుల బేలని
నీ అలుక నాకెరుకే.....
ముద్దిమ్మని.. మృదువుగా నన్ను తాకబోతే
ఒయ్యారంగా తలవూపుతూ కలహించాను
నవ్వుకున్నావా.. నిండుగా....
పొద్దు గుంకే వేళ పదిలంగా పిలుపొకటి
వసుధ కౌగిట తిరిగి చేరే ఈ వేళ .. చెలికాడా!
మక్కువతో మిక్కిలి మాలిమి మురిపెంతో
ఒక్క మేలుకొలుపు
నిను వీడిపోయె ఈ సన్నజాజి బతుకు
రెండు ఘడియల కాలమే కావచ్చు
దీనికింత సొగసు .. సోయగమా..
ఎందుకో తెలుసా మరి...
నిన్ను అలరించిందిగా...

- బులుసు సరోజినీదేవి, 9866190548