సాహితి

ఊరు చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాయి గిర్కి మీద పావురం కూత
పల్లె సౌందర్య గీతం
చింత చెట్ల కింద పంటల కొయినోల్ల పొయ్యి
కాలం సంతకం
తాటికాయల బండిగీరలు
బాల్యం ఆనవాళ్లు
పచ్చటి పొలంలో కొంగల నడక బతుకు వేట
గుడిసెల మీద పాకిన చిక్కుడు తీగ
చిక్కుముళ్ల సంసార దృశ్యం
పలిగిన గోలెం వలసపోయిన ఇజ్జత్ రూపం
మొండి గోడ మీద మొలిచిన పచ్చగడ్డి
తడారి పోని ఆశల వసంతం
ఇంటిముందరి గనే్నరు చెట్టు నీడ
ముసలి తనాల కాపలా
పుటం పెట్టే చేతులల్ల
సారె తిప్పుతున్న చేతుల మట్టి పరిమళం
మగ్గం లొద్దిల కాళ్ల సంగీతానికి
తమ్మళి బాజా దరువు
భూమి పలక మీద నాగలి మొన అక్షరాభ్యాసం
సాన్పు వాకిళ్లు
ఫక్కీరోళ్ల దువాల ఊదుపొగ
పాడుబడ్డ శివాలయంలో గబ్బిలాల విలాపం
చెట్టు మీద ఆవులమాస రూపం
ఊరు చిత్రం

- వేముగంటి మురళీకృష్ణ 9676598465