సాహితి

సమభావమే సాహిత్య ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్దమే సృష్టికి మూలం, కవికి ఆధారం. సృష్టిలో మనిషి ఒక్కడికే మాట ఉంటుంది. ఆ మనిషి తీరు మంచిగా ఉంటే అతని జీవితం సాఫీగా సాగుతుంది. మనిషి మాటకే నానా అర్థాలు రాసుకుంటాడు కవి. పదార్థాన్ని చూసి కవికి భావం వస్తుంది. భావంతో మాట, మాటతో కవిత్వం వుంటుంది.
శబ్దానికి వేదోద్భవ కాలంనుండి పరమోదిష్ట స్థానం ఇవ్వబడింది. ఒక్కొక్కసారి అది పరమాత్మకు పర్యాయంగా ఓంకారంగా వాడబడుతుంది. శబ్ద బ్రహ్మమే వేదాల్లో చాలా వరకు ధాతుజాలైన శబ్దాలే ఉన్నాయి. యాస్కుడు ఋషి వీటిని ప్రవచించాడు, వ్యాఖ్యానించాడు. ‘ఋషి ర్ద్‌ర్శనాత్’ అన్నది నిర్వచనము. ‘ఋషిగీతౌ’ ఈ శబ్దాన్ని చూసినప్పుడు దర్శనము చేతనే ధర్మమని స్ఫురిస్తుంది. ఆ ఋషిత్వమును ఒనగూర్చుకున్న తరువాతనే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. అందరి హితం కోరేదే సాహిత్యం. మన పూర్వీకులు కవిత్వాలు కానీ, రచనలుకానీ, సమాజ శ్రేయస్సు కోసం రాసేవిగా వుండేవి. కానీ నేడు వ్యక్తిగత స్వార్థం కోసం కొంతమంది సమాజాన్ని దూషించే విధంగా, పురాణాలను వక్రీకరించే విధంగా సాహిత్యం సాగుతున్నది. చదవేస్తే ఉన్నమతి పోయిన సామెతగా సాగుతున్నది. సమభావం పోయింది. స్వార్థం పెరిగిపోయింది. ‘పైసా వసూల్, పైసా వసూల్’గా దూషణ భూషణలు ఎక్కువైనవిగా పుస్తకాలు వస్తున్నవని అనుభవజ్ఞుల మాట.
ఎక్కువ తక్కువ భావాలతో కాకి అరుపులు, కలహాలకు తోడ్పడుతున్నవి. ఒక సమాజంలో మంచి చెడు వుండడం సహజం. కాకి కోయిలలు కొంత కలిసి వుంటాయి. తిరిగి దేని అరుపులు అవి అరుచుకుంటూ దారి పడతాయి. కాకి కోకిల కాదు, కోకిల కాకి కాదు. సాహిత్యానికి సంగీతమే ప్రధానం. కాకి అరుపులు పట్టించుకోవు. అవి దాని తృప్తి కోరకే అరుస్తుంటాయి. అందుకే కాకి కన్ను లొట్టయిందని మన పురాణ కథలు. కాకి కుళ్లు బైటపడుతుంది వాటివల్ల. ఇప్పటికీ మన పెద్దలు కాకమ్మ కబుర్లు, పిల్లల పిట్ట కథలు కంచకాడ మంచకాడ కబుర్లుగా, కులమతాల కూతలుగా కొట్టిపారేస్తారు. వాటిలో సత్యం కాని నిజం కాని లేదంటారు. కొన్ని పుస్తకాలు పురిటిలోనే దెబ్బతింటాయి. మానవుడు ఎంత గొప్పవాడైనప్పటికీ అతడు తన వ్యక్తిగత స్వార్థం కోసం, సమస్త సమాజానే్న కాదు, ప్రకృతిలోని ప్రతి భాగాన్ని కించపరచడం మానవతావాదం కాదు. ఈ అనంత విశ్వరచనలో మానవుడు ఒక భాగం. మానవునికి ప్రకృతికి పరమ తత్వానికి మధ్యగల అవిభాజ్యమైన అనుబంధాన్ని మానవతా వాదం వివరిస్తుంది.
‘ఏకాత్మ మానవతా వాదం ప్రపంచానికి నిర్దేశం’. దేశ సమైక్యతకు, సమగ్రతలకు పునాదులని పురాణ ప్రవచనములు, పండిత వచనములు. ఆత్మకళను సిద్ధింప చేసుకోవడం చేతనే అతడికి కవిత్వం కానీ, రచన సాహిత్యం సిద్ధిస్తుంది. అంతేకానీ అక్షరాలు అల్లడంవల్లకానీ, వాక్యాలను పేనడంతో కవిత్వ వచనాలు రావు. కవికి శబ్ద రహస్యం తెలియడం తప్పని సరిగా వుండాలి. రవి కాంచనిది కవి కాంచున్ అని అంధకారముచే కనపడని పదార్థం యొక్క స్వరూపాల్లోకి జ్ఞానాన్ని ప్రసరింప చేస్తాడు. కవి ఆ విధంగా ఆద్యుతుడే. ఆకాశము శబ్ద గుణ సంభూతం, కవియున్ను అంతియే. మనుజులలో ఆకాశమునందు శబ్దము వలె, నాభినుండి వాయువు సహస్రారం వరకు మెలికలు తిరిగినట్టిది శబ్దం, ఇంట్లో ఉత్పన్నమవుతుంది. ముఖావయములు దానికి ఆకారాన్ని ఇస్తాయి. ఆ అక్షరములు ప్రతి పదంలోను ఈ మహాశ్చర్యం వున్నప్పుడు శబ్ద రూప సందర్శన మనసు గమనిస్తూనే వుంటుంది. ఈ గమనం రెండురకాలు. ఒకటి అంతరం, రెండు బాహిరం. ఈ బాహిరం మాయా సంబంధం. మాయజనుతులైన మానవులు దీనియందు బతుకుతున్నారు. రచనలు చేస్తున్నారు. సమాజానికి కీడు చేస్తున్నారు. ఆకాశమునందలి శబ్దములు మనం వినలేము. వస్తు సంఘర్షణ జనిత శబ్దాన్ని వినగలము. మానవ ముఖమునుండి వచ్చిన శబ్దమును భాషగా అంగీకరించి సంగీతముగా అన్వయించి విభజించుకుని దానియందు రమించుచున్నాము. ప్రతివాడు గాయకుడగుటలేదు. ప్రతివాడూ భాషావేత్త యగుట లేదు. ఎందుచేత? ఈ దేశము తత్తర్పూర్వ జనసంస్కార విశేషమని సమాధానం చెప్పుచున్నది. అనుభూతి ఆత్మ చైతన్యాన్ని జాగ్రత్త పరుస్తుంది. వికసితం చేస్తుంది. విస్తృతం చేస్తుంది. మనిషిని మారుస్తుంది. దృగ్విశేషాన్ని ఇస్తుంది. కవికి అనుభూతి కావాలి. దాన్ని అక్షరాల్లో మార్చాలి. అనుభూతికి శీల సంపద అవసరమవుతుంది. అది లేనినాడు మైండ్ బ్లాక్ అవుతుంది. అక్షరాలు మసకబారతాయ. తప్పుడు రాతలు వస్తాయని, మన సనాతన ధర్మం బోధిస్తున్నది. ప్రతి పుస్తక రచన భాగవతంలా వుండాలి. ప్రతి వ్యక్తిలో ప్రేమానురాగాలు పండాలి. ఇది మన సనాతన హిందూ ధర్మం.

- జె. ప్రసాదరావు, 7842501843