సాహితి

మరో రక్త తర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక బలహీన క్షణం. .. రహస్యం
రూపాంకురం .. అత్యంత రహస్యం
అత్యంత గోప్యంగా
రహస్య మందిరంలో
ఇప్పుడు నిశ్శబ్ద రణరంగం

గొంతులో గుడ్డ కుక్కబడిన
మూగ వేదన
బహుశా తొమ్మిది మాసాలుగా
దాచుకున్న రహస్యాన్ని
రక్షించే యుద్దమే అనుకుంటా...
ఇప్పుడిప్పుడే పచ్చి నెత్తురు వాసన
అంతలోనే మరో అరణ్య రోదన
లేత రక్తమాంసాల సంతర్పణ

కత్తిరించిన చిట్టి పాదాలు
దేశ గుమ్మానికి వేలాడుతున్నాయి
కుక్కలు పీకిన కండ నెత్తుటి అలలు
చరిత్ర స్మృతిలో ఘోషిస్తున్నాయి
ఛిద్రమైన లేలేత దేహాల చర్మాలపై
దేశ ప్రగతి పరిగిడుతోంది.

అక్రమ సంతానాన్ని కన్న తల్లులారా
దేశం కళ్లు మూసుకొంది
కానిచ్చేయండి తొందరగా
అమ్మకు అర్థాన్ని చెరిపివేసి
చరిత్ర పుటలలో రహస్యంగా
మరికొన్ని పేజీలు చేరుద్దాం

8985343468