సాహితి

విజయానికి ఆవలి వైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దం పగిలిందా
రాయిని కాదు ప్రశ్నించాల్సింది
విసిరిన చేయిని!

పగిలిందని ఎగిరి గంతేయకు
నీ వికృత రూపాన్ని
అది వేయి ముఖాలుగా చేసి
లోకానికి పట్టిచ్చింది!

నన్ను చూసి కన్ను మండిందా
చల్లార్చాల్సింది కంటిని కాదు
నీలోన మండుతున్న అసూయని!

ఆర్పకపోతేనేం
భావించావా లోలోన?
నిలువునా దహించేది నినే్న!

నీతో యుద్ధం చేసే తీరిక
ఇక్కడెవరికీ లేదు

శతృవుల్లేరని మీసాలు మెలేస్తావా?
లోనికోసారి తొంగి చూసుకో
అగుపించాయా
నీతో నీవు చేస్తున్న పోరు దృశ్యాలు!

అబద్ధం చెబుతావా?
కొత్త యుద్ధానికి నగారా మోగినట్లే
నిన్ను నీవే గెల్వలేకపోతే
నీవెవరినీ ఓడించలేవు

ఓటమి ఎక్కడో లేదు
విజయానికి ఆవలి వైపే!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి