సాహితి
కళ్లు సృష్టించిన కొత్త భాష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆ కళ్లు కొత్త భాషపై అక్షరాలు రుద్ది
హృదయంలోని భావాలను
చేతివ్రేళ్లపైన ఆడిస్తాయి
ఆ వ్రేళ్ళేమో మనిషికి - మనిషికి మధ్యన
జవాబుదారిగా నిలుస్తాయి
ఆ కళ్ళు సృష్టించిన కొత్త భాషతో
ప్రపంచపు భాషామోము మూగదవుతుంది
నీ భాష నీది - నా భాష నాది అనే ఆ కళ్ళూ
చెవులకు - నోటికి పని లేకుండా చేస్తాయి.
మనిషికి - మనిషికి మధ్యన వారధిగా నున్న
ఆ చేతి వ్రేళ్లు .. ఆడించిన పుడల్లా
భావాలు బద్దలై... అక్షర రూపంలో కాక
కళ్ళు సృష్టించిన భాషలో భావాలౌతాయ
అవును ఆ మనుషుల చెవులు
ఏ రహస్యాన్నైనా దాచుకోలేవు
ఎందుకంటే ఆ చెవుల రంధ్రాలు తెరుచుకోవు
ఆ రంధ్రాల ఊపిరి ఆగినట్టుంది
మనుషుల నోటికి ప్రకృతి సృష్టించిన
తాళాలు బిగించి తాళపు చెవులను
సృష్టి ఉద్దేశ పూర్వకంగానే కావచ్చు
తన మాయాజాలంతో మసి చేసింది
అందుకే వాళ్ళ కళ్ళు కొత్త భాషను సృష్టించి
చేతుల నిండా పనిని కల్పించాయి
ఇప్పుడు ఆ మనుషుల మధ్యన
చేతి వ్రేళ్లు మాత్రమే మాట్లాడుతున్నాయి.
- మహమ్మద్ నసీరొద్దీన్
9440237804