సాహితి
బాగుండును
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 October 2017
- లక్ష్మీ విజయ, 8977311737

ఆకలి లేని కాలాలు
అబలలు లేని దేశాలు
మాయలేని మనుషులు
మాసిపోని మమతలు
ఉంటే బాగుండును
రైతుకి కష్టాలు
నేతకి నష్టాలు
బాల్యానికి బరువులు
బరువైన బ్రతుకులు
పోతే బాగుండును
స్వార్థానికి సంకెళ్ళు
అవినీతికి ఉరిత్రాళ్ళు
పడితే బాగుండును
న్యాయానికి కళ్ళు
ధర్మానికి పాదాలు
పుడితే బాగుండును
ఆడదంటే బొమ్మ కాదు అమ్మని
ఆ అమ్మ లేనిదే ఈ జన్మ లేదని
దేశమన్నది ఒకరి సొత్తే కాదని
శాంతి భద్రత ప్రతి పౌరుని హక్కని
మానవత్వ మొక్కటే మనిషికి చిహ్నమని
మనుషులంతా ఒక్కటైతే ప్రగతి సాధ్యమని
గగనమెత్తు గొంతుతో
సంద్రమంత శోకంతో
విన్నవించుకుంటోంది భారతావని
వింటే ఎంత బాగుండును.