సాహితి

అమాయకురాలి అనవసర ఆవేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారద, సరస్వతి అక్కచెల్లెళ్ళు. అయితే వీళ్ల మధ్య అవసరం అయిన అనురాగానికి బదులు అనుకూలత ఏర్పడింది. సరస్వతి మానసిక ప్రసక్తే ఇందుకు కారణం. శారదకు ఏమీ తెలియదు. ఈ అననుకూలత గురించి ఆమెకు పెళ్ళై మొగుడితో చెన్నైలో కాపురం చేస్తుంది. గర్భవతి అయినపుడు కాస్త ఇంటి పనులకు సాయంగా వుంటుందని చెల్లెలు సరస్వతిని పంపించమని తల్లికి ఉత్తరం రాస్తుంది. సరస్వతికి అక్కడికి వెళ్లడం ఇష్టం ఉండదు. అక్కను ఎక్కువగా చదివించారని, పదివేలు కట్నం ఇచ్చి కాలేజీ లెక్చరర్‌తో వివాహంచేశారని అసూయ లాంటి భావం. సరస్వతికి పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా జరగడంలేదు. ఆర్థిక కారణాలవల్ల ఉబుసుపోక నవలలు, పత్రికలు చదవడం తప్ప ఇంకేం కాలక్షేపం లేదు ఆ అమ్మాయికి. సినిమాలకు వెళ్ళే అవకాశం కూడా బహు తక్కువ.
ఇటువంటి వాతావరణంలో పెరిగిన సరస్వతి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఓ యువకుడిని గమనిస్తుంది. శ్రీమతి ఆచంట శారదాదేవి రాసిన మామూలు మనిషి అన్న కథానికలో సన్నివేశం ఇది. సాధారణ పాఠకుడు అయితే సరస్వతినే ఆ కొత్తగా పరిచయం అయిన యువకుడిని ప్రేమానుబంధం ఏర్పడి అది పరిణయం దాకా రావడమో కాక పరాభవంగా మారడమో ఊహకు వస్తుంది. కానీ ఈ కథానిక పద్ధతి వేరు.
ఒంటరిగా ప్రయాణం చేస్తుందన్న సరస్వతి రైలు పొడుగునా నిర్విరామంగా ఇబ్బంది పడడం- గూడూరు స్టేషన్ వచ్చాక రైలు పెట్టెలో తతిమా ప్రయాణికులందరూ దిగిపోయి, ఆ యువకుడు, సరస్వతి మాత్రమే మిగిలిపోవడం జరుగుతుంది (కథలలో తప్ప మామూలు పరిస్థితుల్లో ఇది అసాధ్యం అనే విషయం పక్కకు పెడదాం కాసేపు). సరస్వతికి తాను చదివిన కథల, నవలల నేపథ్యంలో ఈ యువకుడు ‘నర రూప రాక్షసుడు’గా మనసును వేధిస్తూ వుంటాడు. అతనినుంచి తప్పించుకోవడానికి టాయిలెట్‌లో కూడా దాక్కుంటుంది కొంతసేపు. అతను అంత దుర్మార్గుడుగా కనిపించడు. ఆమెకు చదువుకోవడానికి పేపర్ ఇస్తాడు, కాఫీ ఇస్తాడు, ఆదరణగా పలుకరిస్తాడు.
తీరా రైలు మద్రాసులో ఆగిపోయాక సరస్వతి ఫ్లాట్‌ఫాంమీద ఒంటరిగా మిగిలిపోతుంది. ఉత్తరం అందనందువల్ల అక్కగానీ, బావగానీ స్టేషన్‌కు రారు. ఆ యువకుడే ఆమె చిరునామా విచారించి తాను అటువైపే వెళుతున్నానని, ఇంటిదగ్గర దిగబెడతానని ఆమెను ఒప్పించగలుగుతాడు. ఆమెకు వేరే దారి లేదు కనుక అతని సహాయ సహకారాలతోనే అక్కగారి ఇంటికి క్షేమంగా చేరుకుంటుంది. ఇంతలో సరస్వతి మనసులో నరరూప రాక్షసుడు మాయమైపోయి, నవలలో కనిపించే రాజకుమారుడు ప్రత్యక్షం అవుతాడు.
సరస్వతి మానసిక వేదన అంతా యిటుపైనే ప్రారంభం అవుతుంది. ఆ యువకుడిమీద అనురాగం, ఆప్యాయత ఏర్పడి కొన్ని రోజులపాటు కిటికీ దగ్గరే కూర్చుని అతనికోసం ఎదురుతెన్నులు చూస్తుంది. అతని పేరు, అడ్రస్ కనుక్కోకపోయినందుకు తనను తాను నిందించుకుంటుంది. ఒక వారం రోజుల తరువాత శారద చెల్లెలును సినిమాకు తీసుకువెళుతుంది. యాదృచ్ఛికంగా (ఇది కథలలో, సినిమాలలో జరిగే సందర్భమే అనుకున్నా ఇబ్బందేమీ కాదు) ఆ యువకుడు, మరో అమ్మాయితో అదే సినిమాకు వస్తాడు. సరస్వతి అతన్ని కనిపెట్టి అక్కతో చెబుతుంది. శారద అతి మామూలుగానే ‘అతనా? అతను మనకు తెలిసినవాడే. మీ బావ కాలేజీలోనే పనిచేస్తున్నాడు. మొన్నీమధ్యనే పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి అతని భార్య అని తెలియజేస్తుంది. ఈ జవాబుతో సరస్వతి మానసిక వికారాలన్నీ మాయమైపోతాయి. సరస్వతి ముఖం చిన్నబోయింది. అతను హీరో కాదు విలనూ కాదు వట్టి మామూలు మనిషి. కాస్త అసంతృప్తి కలిగింది. మళ్లీ తన తెలివితక్కువకు తానే సిగ్గుపడి నవ్వింది అని కథ ముగింపు చేస్తారు శ్రీమతి ఆచంట శారదాదేవి.
అనేక కథలు వ్రాసి రకరకాల జీవన సరళికి సాహిత్య రూపం కల్పించిన వీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. స్ర్తి రచయితలలో ప్రముఖ శ్రేణికి చెందినవారు.

- శ్రీవిరించి, 09444963584