సాహితి

గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరి తనమెందుకో
ఒక్కోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురు తిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికి మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోని నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

ఖాళీ తనమేలెమ్మని రాజీపడిన
ఓ అలజడి మళ్లీ రాజుకుంటుంది
శూన్యానివి కాదు పొమ్మంటూ
ఒక్క ఆకుకైనా ఖాళీ చూపలేని
ఓ మృత్యుఛాయవంటూ నిందిస్తుంది

స్వగతమొకటి రెండుగా చీలి
రెండు భిన్నమైన నన్ను’లను
నాకు పరిచయం చేస్తుంటే
ఎప్పటికప్పుడు దారి తప్పనివ్వని
ఓ నిస్సహాయత...
దోషినని అంగీకరించేస్తుంది
దిగంతాల వైపు భరోసా చూసుకుంటూ
అప్పుడప్పుడూ ఎందుకో మరి
ఇలా ఓ పరిపూర్ణత సంధించిన ఏకాకితనం
మనసుని గురి చేసుకుంటుంది
నవ్వొకటి మరలా ఇష్టమయ్యేంత వరకూ....

- స్వాతి సాయి యాకసిరి