సాహితి

గోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలు చీల్చే అడ్డుగోడ
మనసు పక్షులు ఎగురుతుంటే
హద్దు దాటని మాటలు గింగిరాలు
శబ్దం గోడల మధ్య బందీ
క్షణాల్లోనే మీదపడి కరిచిన పిల్లిలా ప్రతిధ్వని
గొంతులో మైకు బిగించుకున్నా
మద్యం కుస్తీ రింగ్‌లోకి దిగినా
పొయిలో ఉప్పురాళ్లలా చిటపటలాడినా
కోర్కెల దుస్తులు సిగ్గొదిలేసినా
నాలుగ్గోడలు పరువుకు కాపలా
గోడ బతుకు బజారుపాలయితే
అర్ధనగ్న బొమ్మల సినిమా అతుక్కోవచ్చు
కైపు కలల బేహారికి ఆహారం కావచ్చు
వ్యాపార మాయ కిక్కెక్కిస్తే
ఉచిత స్కీంల మెరుపులు
గోడలపై మొలిచే నినాదాల పిడికిళ్లు
ఆశావాదులకు భవిష్యత్తు కలలు
దారినపోయే కడుపుబ్బరాలకు ఊరట
***
గోడల్లేని ఆలోచనలు పిచ్చోడి చేతిలో రాళ్లు
శ్రమ చైనా గోడలు లేవనంత కాలం
పెట్టుబడుల ప్రపంచీకరణ కువ్వారం
ఎండకు ఎండి, వానకు తడవడం రాదు
పాడుబడి పడిపోవడం అసలే కాదు
గోడల జీవన లక్ష్యం
గోడలు నలుపెక్కినా సరే
ఉద్యమ పాఠాలకు కావాలి బోర్డులు

- కొమురవెల్లి అంజయ్య 9985411090