సాహితి

ఎగిరెల్లిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగిరెల్లిపోవాలి
అప్పుడప్పుడూ.. వున్నచోటునుండి.

చెట్టుమీంచి
పక్షులు ఎగిరెల్లిపోయనంత
నిశ్శబ్దంగా
గాలికి మబ్బు దొంతరలు
దొర్లిపోయనంత
అలవోకగా ఏటివాలులో
పడవ ప్రయాణిస్తున్నంత
సునాయాసంగా ఎగిరెల్లిపోవాలి
వున్నచోటనే వుండి
చుట్టూ పరికిస్తే ఏముంది?
భూమి పళ్లెరం మీద
ఆకాశం గాజు గినె నను
ఎవరో బోర్లించినట్టే వుంటుంది
దానికింద గాలాడని గాజు ఈగల్లా
నువ్వూ నేనూ
ఎగిరెల్లిపోవాలి అప్పుడప్పుడూ
చూపుకే అందనంత
సుదూర తీరాలకు
వాయువేగాన్ని మించిన మనోవేగంతో
బంగారు వర్ణపు సన్నని కమ్మచ్చు
కిరణాల ఎండ పొడలో
సూర్యస్నానం చేస్తూ ఎగిరెల్లిపోవాలి!
ఆకాశాన్ని నీలిరంగు బెలూన్ని చేసి
దీర్ఘ శ్వాసి ఎవడో
అదేపనిగా వూదుతున్నట్టు
గుండెలనిండా
ఆత్మవిశ్వాసపు శాసతో ఎగిరెల్లిపోవాలి!
అరక దున్నిన
నల్లరేగడి మడి చెక్కలో
కురిసిన తొలగరి జల్లుకు
ఎగసిన భూ సుగంధాన్ని
ముక్కుపుటాలనిండా ఆఘ్రాణిస్తూ
ఎగిరెల్లిపోవాలి అప్పుడప్పుడూ.
***
ఎప్పటినుండి ఈదుతోందో
బుల్లి బాతుపిల్ల
సరస్సును అదే పనిగా
చిన్ని తెడ్లలాంటి
ఆ ఎర్రని కలువరేకుల పాదాలను చూసి
చెరువు
తన విశాల వర్తులాకారపు విస్తీర్ణాన్ని
చిన్నకుంటగా దగ్గరకు తీసుకుంది
అడవికే ఆలివ్ గ్రీన్ దుస్తులు తొడిగిన
అన్నల ప్లీనరీ సమావేశంలా
కొండ చరియ పక్క
కొలనులో గుమిగూడిన
ఈ ఎర్రకలువల
రహస్య మంతనాలేమిటో!

ఎప్పట్నుంచి వేటాడుతోందో
ఎన్ని చేపపిల్లల్ని ఆరగించిందో
ఇక చాలనుకుందో ఏమో
దొరువు ప్రక్కన
సిమెంటు స్తంభం మీద
ఎగరడానికి సిద్ధంగా వున్న
గరుత్మంతునిలా
రెక్కలను నల్లని గొడుగుల్లా విప్పదీసి
ఎండకు ఆరబెట్టుకుంటుందో
చిలకబాతు -
గొప్ప దేహ చింతతో
కొండంత దుఃఖాన్ని
గుండెల్లోనే దిగమింగుకున్నట్టు
రాత్రంతా గుట్టమీద కురిసిన
ధారాపాత వర్షం
తెల్లారేసరికి గుట్ట దిగువన
దిగులు మడుగు కట్టింది.
ఏటవాలు ఎదురు వానజల్లుకు
మట్టిలో కట్టిన మదురుగోడ
తడిసి కాసింత మెత్తబడ్డట్టు
మనసూ మెత్తబడింది.

అక్కడితో
ఎగిరివచ్చిన పని పూర్తయంది.

మణి 9848202526