సాహితి

ఈ నేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లని మల్లెల సువాసనలందించింది
పచ్చని చేమంతుల పూబంతుల
అందాలను పంచింది
గులాబీ పరిమళాల గుబాళించింది
పత్రహరితం నింపి చెట్ల ఆకుల నీడనిచ్చింది
అందమంటే తెలిపింది ఆనందమంటే తెలిపింది

పంచవెనె్నల రామచిలుకలు
తీయని పాటల కోయలమ్మలు
వేకువ కువకువల పిచ్చుకలు,
మేల్కొలిపే కొక్కరలు
నింగినెగిరే సోయగమై పరవశ భావ పరంపరలందించింది
కుంటలు, చెరువుల చల్లదనాలు
గలగల పారే నదీనదాలు
ఉత్తుంగతరంగ ఉల్లాసోల్లాసాలు
అనంతసాగరంపై మనోవిహంగపు
నవ భావనై మురిపించింది

దైతాద్వైత మనోగతాల పరిచయాలు
విశిష్టాద్వైత, వివిధ మత మానవ
సమ్మిళిత సంఘాలు
ప్రజాతీర్పుల మానవహిత సంబంధ బాంధవ్యాలు
జనన మరణాల జాగరూకతలు నేర్పింది
వర్గ వైషమ్యాలొద్దని
వర్ణ విభేదాలుండొద్దని, జాతి వివక్ష కూడదని
వయో పరిపక్వత వంటి
వర్ణ సమన్వయం నేర్పింది
భావ సమన్వయమంటి
వర్ణ సముచ్ఛయాన్నిచ్చింది
ఈ నేల విజ్ఞానం
ఈ నేల వైకల్ప కల్పిత సాంగత్యం
ఈ నేల నాది, ఈ నేల నీది
ఆకాశంలో ఒంటరి కాదు గుంపులో పిడికిలి!
సంగీత శాస్త్రాల, జానపద వరాల
గొంతెత్తు గీతం
అందులో ప్రతి స్వరం నేనే
అందులో ప్రతి అక్షరం నేనే
నా దేశం భారతదేశం
నా దేశం భవ్య సందేశం

- కొండపల్లి నీహారిణి 9866360082