సాహితి

లో జెరం పగలు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక మొగ్గ తొడగడం వుండదనే
స్థితి తెలిసినప్పుడు
దించుకోలేని దిగులు

ఇన్నినాళ్లు
ఎగిరెగిరిపడిన కోరికలు
సహజంగా ఇంకిపోతున్నాయనే
గతి ఎరిగినప్పుడు
పంచుకోలేని వగపు

బీపీ, తీపీ కలగల్సిన పెయ్య
దినమంతా చేదు ఎక్కుతుంది

ఇక చెట్టు కాతపూతలు మాని
నీడను మాత్రమే పరుస్తుంది
తెంపిన తోటకూరలా వల్లి
వాంఛ కడకడలు
ఈగుతున్నప్పుడు కుంగిపోతాం

జీవధారతో నిండుగా పారిన వాగు
ఎండమావులను మోస్తుంది
ఇప్పుడు చప్పుడు చేయక
దాసోహం తప్ప దాహం నెరవేరదు

శరీరం ఉక్కిరిబిక్కిరై
చిక్కీచిక్కక బిక్కమొకం వేస్తుంది

బెడ్‌రూమ్‌కు వడదెబ్బ తగిలి
సంగమం ఒక్కటే జీవితం కాదు అని
ఏదో పెగ్గెలు పోతాం గానీ
చూస్తూ చూస్తుండగానే వాంఛనీయము
పుటుక్కు జెరజెరా
డుబుక్కు మే బెంగటిల్లుతుంది

- జూకంటి జగన్నాథం 9441078095