సాహితి

నిరంతర చిరునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వెవరివైనా నవ్వు నీకందం
తోటివారిలోనూ నవ్వుల పువ్వులు
పూయంచగలిగితే మరింత అందం

నోటితో నవ్వుతూ
నొసటితో వెక్కిరించడం కాక
ఎవరినైనా నువ్వు
మాటతో మనసుతో
చూపుతో చేష్టతో
హాస్యం మేళవించి
వారివారి చింతలు చికాకులు
అన్నింటిని కాకున్నా
కొన్నింటినైనా దూరం చెయ్యగలవు

వారికి కోరకనే
దొరికిన చెలిమవుతావు
అయాచితంగా దొరికిన
బలమవుతావు

కారుచీకట్లను చీల్చగలిగే
కాంతిరేఖవవుతావు

వేకువ వెలుగుల
శ్రీకారమవుతావు

ప్రతి నిత్యం పరుల గుండెల్లో
శుభకార్యాల తాలూకు
శాశ్వత చిరునామా అవుతావు

- డా. కొల్లు రంగరావు, 9866266740